అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Markets) ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాల దిశగా సాగినా కొనుగోళ్ల మద్దతుతో తర్వాత కోలుకున్నాయి.
సోమవారం ఉదయం ఉదయం సెన్సెక్స్ 103 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 26 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 83,609 పాయింట్లకు తగ్గినా తర్వాత కోలుకుని ఇంట్రాడేలో 84,052 పాయింట్ల గరిష్టానికి చేరుకున్నాయి. నిఫ్టీ 25,645 నుంచి 25,773 పాయింట్ల మధ్య కదలాడిరది. మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 53 పాయింట్ల నష్టంతో 83,885 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 25,731 వద్ద ఉన్నాయి.
పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో జోరు..
బీఎస్ఈలో రియాలిటీ(Realty) ఇండెక్స్ 2.74 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.14 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.03 శాతం, మెటల్(Metal) 0.87 శాతం, హెల్త్‌కేర్ 0.82 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.81 శాతం, ఎనర్జీ 0.71 శాతం లాభంతో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.71 శాతం, ఐటీ 0.51 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.51 శాతం నష్టంతో ఉన్నాయి. స్మాల్ క్యాప్(Small cap) ఇండెక్స్ 0.54 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో ఉండగా.. 17 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎంఅండ్ఎం 1.53 శాతం, ఎస్బీఐ 0.94 శాతం, ఎటర్నల్ 0.88 శాతం, టాటా మోటార్స్ 0.68 శాతం, పవర్‌గ్రిడ్ 0.45 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : మారుతి 3.78 శాతం, ఐటీసీ 1.50 శాతం, టీసీఎస్ 1.23 శాతం, బీఈఎల్ 1.03 శాతం, ఎల్టీ 0.90 శాతం నష్టాలతో ఉన్నాయి.