అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | కీలకమైన యూఎస్ ఫెడ్ సమావేశాల ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Markets) స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 21 పాయింట్లు, నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమయ్యాయి.
సెన్సెక్స్ 81,779 నుంచి 81,998 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ(Nifty) 25,064 నుంచి 25,138 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 51 పాయింట్ల లాభంతో 81,956 వద్ద, నిఫ్టీ 02 పాయింట్ల లాభంతో 25,116 వద్ద ఉన్నాయి. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య చర్చలతోపాటు యూఎస్ ఎఫ్‌వోఎంసీ(FOMC) మీటింగ్‌లో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న నిర్ణయంపై మార్కెట్ల గమనం ఆధారపడనుంది. 25నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తే ఎఫ్‌ఐఐలు తిరిగి దేశీయ స్టాక్ మార్కెట్‌వైపు చూసే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం అనలిస్టులలో వ్యక్తమవుతోంది.
ఐటీలో సెల్లాఫ్..
ఇన్‌ఫ్రా(Infra), రియాలిటీ, టెలికాం రంగాల షేర్లు రాణిస్తుండగా.. ఐటీ, హెల్త్‌కేర్ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్‌ఈలో రియాలిటీ(Realty) ఇండెక్స్ 1.28 శాతం పెరగ్గా.. ఇన్‌ఫ్రా 0.88 శాతం, పవర్ 0.78 శాతం, టెలికాం 0.74 శాతం, ఇండస్ట్రియల్ 0.72 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.57 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.50 శాతం లాభాలతో సాగున్నాయి. ఐటీ ఇండెక్స్ 0.96 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.48 శాతం, హెల్త్‌కేర్ 0.44 శాతం నష్టంతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.56 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం లాభాలతో సాగుతుండగా.. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.01 శాతం నష్టంతో ఉంది.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 14 కంపెనీలు లాభాలతో ఉండగా.. 16 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
బజాజ్ ఫైనాన్స్ 1.27 శాతం, ట్రెంట్ 0.88 శాతం, ఎల్‌టీ 0.57 శాతం, ఎటర్నల్ 0.54 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.51 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఆసియా పెయింట్ 1.19 శాతం, టైటాన్ 1.17 శాతం, ఇన్ఫోసిస్ 1.13 శాతం, టీసీఎస్ 1.09 శాతం, ఎంఅండ్‌ఎం 0.95 శాతం నష్టంతో ఉన్నాయి.