Homeబిజినెస్​Stock Market | గ్యాప్‌ అప్‌లో ప్రారంభమైనా.. నష్టాల్లోకి జారుకున్న సూచీలు

Stock Market | గ్యాప్‌ అప్‌లో ప్రారంభమైనా.. నష్టాల్లోకి జారుకున్న సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic Stock Markets) వరుసగా రెండో రోజూ గ్యాప్‌ అప్‌లో ప్రారంభమైనా.. లాభాలను నిలబెట్టకోలేకపోయాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడే (Intraday) గరిష్టాలనుంచి 698 పాయింట్లు పతనమైంది. ఐటీ షేర్లలో బలహీనత కొనసాగుతుండడం, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్‌లోనూ సెల్లాఫ్‌ కొనసాగుతుండడంతో సూచీలు ఇంట్రాడే గరిష్టాల వద్ద నిలదొక్కుకోలేకపోతున్నాయి.

గ్లోబల్‌ మార్కెట్లు (Global markets) పాజిటివ్‌గా సాగుతున్నా మన మార్కెట్లు మాత్రం ఒత్తిడికి గురవుతున్నాయి. దేశీయంగా సానుకూల అంశాలు ఉన్నా స్టాక్‌ మార్కెట్‌ మాత్రం ముందుకు కదలడం లేదు. శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ 294 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 24 పాయింట్లు పెరిగింది. అక్కడి నుంచి 698 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ (Nifty) 84 పాయింట్ల లాభంతో ప్రారంభమై 14 పాయింట్లు లాభపడింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 201 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ (Sensex) 252 పాయింట్ల నష్టంతో 80,465 వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో 24,668 వద్ద కొనసాగుతున్నాయి.

ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో ఒత్తిడి..

ఆటో (Auto) షేర్లు రాణిస్తున్నా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు సూచీలను కిందికి పడేస్తున్నాయి. బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్‌ 1.14 శాతం పెరగ్గా.. క్యాపిటల్‌ మార్కెట్‌ 0.37 శాతం, హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 0.27 శాతం లాభంతో ఉన్నాయి. ఐటీ ఇండెక్స్‌(IT index) 1.39 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.32 శాతం, రియాలిటీ 1.01 శాతం, కమోడిటీ ఇండెక్స్‌ 0.30 శాతం నష్టంతో ఉన్నాయి. మిగతా ఇండెక్స్‌లు స్వల్ప లాభనష్టాలతో కొనసాగుతున్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.07 శాతం లాభంతో ఉండగా.. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.17 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 0.06 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top Gainers :బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో ఉండగా.. 17 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎంఅండ్‌ఎం 2.23 శాతం, ఎటర్నల్‌ 2.16 శాతం, పవర్‌గ్రిడ్‌ 1.13 శాతం, మారుతి 0.95 శాతం, రిలయన్స్‌ 0.59 శాతం లాభంతో ఉన్నాయి.

Top Losers : ఐటీసీ 2.37 శాతం, టీసీఎస్‌ 2.05 శాతం, ఇన్ఫోసిస్‌ 1.68 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.58 శాతం, టెక్‌ మహీంద్రా 1.51 శాతం నష్టంతో ఉన్నాయి.