ePaper
More
    Homeబిజినెస్​Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 0.7 శాతం డౌన్‌

    Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 0.7 శాతం డౌన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | ఇరాన్‌(Iran), ఇజ్రాయిల్‌ మధ్య యుద్ధభయాలతో గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) నష్టాల బాటలో పయనించాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు భారీ నష్టాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 1,264 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 415 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. అయితే కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో పతనానికి అడ్డుకట్టపడింది. సూచీలు క్రమంగా పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్‌ 573 పాయింట్ల నష్టంతో 81,118 వద్ద, నిఫ్టీ(Nifty) 169 పాయింట్ల నష్టంతో 24,718 వద్ద స్థిరపడ్డాయి.

    బీఎస్‌ఈలో 1,516 కంపెనీలు లాభపడగా 2,469 స్టాక్స్‌ నష్టపోయాయి. 137 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 80 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 57 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 5 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 5 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీల మొత్తం విలువ రూ. 3.18 లక్షల కోట్లు తగ్గింది.

    Stock Market | పీఎస్‌యూ బ్యాంక్స్‌లో సెల్లాఫ్‌..

    రియాలిటీ(Realty), హెల్త్‌కేర్‌ రంగాల షేర్లలో మినహా మిగతా అన్ని రంగాల షేర్లు సెల్లాఫ్‌కు గురయ్యాయి. బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్‌ 0.13 శాతం, హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 0.08 శాతం పెరిగాయి. పీఎస్‌యూ బ్యాంక్‌(PSU bank) ఇండెక్స్‌ 1.66 శాతం నష్టపోగా.. బ్యాంకెక్స్‌తో పాటు ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు ఒక శాతం మేర పడిపోయాయి. మెటల్‌ ఇండెక్స్‌ 0.81 శాతం, పవర్‌ ఇండెక్స్‌ 0.75 శాతం నష్టపోయాయి. ఎనర్జీ, పీఎస్‌యూ, టెలికాం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.67 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.30 శాతం తగ్గాయి.

    Stock Market | పతనానికి కారణాలు..

    ఇరాన్‌పై ఇజ్రాయిల్‌(Israel) దాడి చేయడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతింది. దాడులు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్‌ ప్రకటనకు తోడు ఇరాన్‌ సైతం డ్రోన్‌ దాడులతో స్పందించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధరలు 10 శాతానికిపైగా పెరగడం ఆందోళన కలిగించింది. చమురు ధర పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ముడిచమురు దిగుమతిదారుల్లో భారత్‌ ఒకటి కావడంతో మన మార్కెట్లు నెగెటివ్‌గా స్పందించాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit booking)కు ప్రాధాన్యత ఇచ్చారు.

    చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్‌ ప్రకటించినప్పటికీ.. జిన్‌పింగ్‌ నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. ఓవైపు ట్రేడ్‌ వార్‌ మరోవైపు జియో పొలిటికల్‌ టెన్షన్స్‌(Geo political tensions) నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు దృష్టి సారించారు. యూఎస్‌ బాండ్లు, డాలర్‌, బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈక్విటీ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.

    Stock Market | Top gainers..

    బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో జూబిలియంట్‌ ఇన్‌గ్రేవియా(Jubilant Ingrevia) 15.38 శాతం, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ 12.26 శాతం పెరిగాయి. ధని సర్వీసెస్‌ 8.68 శాతం, వెలార్‌ ఎస్టేట్‌ 7.89 శాతం, ఐడియాఫోర్జ్‌ 6.17 శాతం లాభపడ్డాయి.

    Stock Market | Top losers..

    బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో జీటీఎల్‌ ఇన్‌ఫ్రా(GTL infra) 9.66 శాతం, టాటా టెలిసర్వీసెస్‌ 6.95 శాతం, హెచ్‌సీసీ 5.99 శాతం, సుబెక్స్‌ 4.8 శాతం, ఐఈఎక్స్‌ 4.75 శాతం నష్టపోయాయి.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...