Homeబిజినెస్​Stock Market | భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

Stock Market | భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

ప్రపంచ మార్కెట్ల పాజిటివ్​ సంకేతాలు ఇవ్వడంతో దేశీయ మార్కెట్లు​ లాభపడ్డాయి. అన్ని రంగాల షేర్లు రాణించాయి. సెన్సెక్స్‌ 575 పాయిట్లు, నిఫ్టీ 178 పాయింట్లు లాభంతో ముగిశాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic Stock Markets) లాభాల బాటలో పయనించాయి. అన్ని రంగాల షేర్లు రాణించాయి. సెన్సెక్స్‌ 575 పాయిట్లు, నిఫ్టీ 178 పాయింట్లు లాభపడ్డాయి.

ప్రపంచ మార్కెట్ల(Global Markets)నుంచి అందిన సానుకూల సంకేతాల నడుమ మన మార్కెట్లు రెండు సెషన్ల తర్వాత లాభాల బాటపట్టాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 168 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌(Sensex) 82,084 నుంచి 82,727 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ 25,159 నుంచి 25,365 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్‌() 575 పాయింట్ల లాభంతో 82,605 వద్ద, నిఫ్టీ(Nifty) 178 పాయింట్ల లాభంతో 25,323 వద్ద స్థిరపడ్డాయి. యూఎస్‌ ఫెడ్‌ రేట్‌ కట్‌ ప్రకటించే అవకాశాలు ఉండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడిరది. రేట్‌ కట్‌ చేస్తే వడ్డీ రేట్లు తగ్గి ఎఫ్‌ఐఐలు తిరిగి నెట్‌ బయ్యర్లుగా మారే అవకాశాలు ఉంటాయన్న అంచనాలతో కనిష్టాల వద్ద కొనుగోళ్లతో మద్దతుగా నిలిచారు. క్రూడ్‌ ఆయిల్‌(Crude Oil) ధర తగ్గడం, యూఎస్‌, భారత్‌ల మధ్య త్వరలోనే ట్రేడ్‌ డీల్‌ కుదిరే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు రావడం, డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ ఒక్క సెషన్‌లోనే 73 పైసలు బలపడడం కూడా మార్కెట్‌ పెరుగుదలకు దోహదపడ్డాయి.

Stock Market | రాణించిన అన్ని రంగాలు..

అన్ని రంగాల షేర్లు రాణించాయి. బీఎస్‌ఈలో రియాలిటీ(Realty) ఇండెక్స్‌ 3.06 శాతం పెరగ్గా.. క్యాపిటల్‌ మార్కెట్‌ 2.05 శాతం, టెలికాం 1.94 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.73 శాతం, ఇన్‌ఫ్రా 1.35 శాతం, పీఎస్‌యూ 1.32 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ ఇండెక్స్‌ 1.20 శాతం, మెటల్‌ 1.19 శాతం, సర్వీసెస్‌ 1.17 శాతం, యుటిలిటీ 1.15 శాతం, పవర్‌ 1.05 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 1.03 శాతం, ఎఫ్‌ఎంసీజీ(FMCG) ఒక శాతం లాభపడ్డాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.07 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.83 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.78 శాతం లాభంతో ముగిశాయి.

Stock Market | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,503 కంపెనీలు లాభపడగా 1,659 స్టాక్స్‌ నష్టపోయాయి. 164 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 149 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 137 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 3.38 లక్షల కోట్లు పెరిగింది.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 23 కంపెనీలు లాభాలతో ఉండగా.. 7 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 4.03 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.10 శాతం, ఆసియా పెయింట్‌ 2.48 శాతం, ఎల్‌టీ 2.23 శాతం, ట్రెంట్‌ 2.19 శాతం పెరిగాయి.

Top Losers : టాటామోటార్స్‌ 1.20 శాతం, ఇన్ఫోసిస్‌ 1.07 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.65 శాతం, టెక్‌ మహీంద్రా 0.62 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.24 శాతం నష్టపోయాయి.