అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | డాలర్‌తో పోల్చితే రూపాయి(Rupee) విలువ రోజురోజుకు బలహీనపడుతుండడం, ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ నిరంతరాయంగా కొనసాగుతుండడం, గ్లోబల్ మార్కెట్లతో (global markets) బలహీనత వంటి కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల బాటలో సాగుతున్నాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 326 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 51 పాయిట్లు కోల్పోయింది కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుని 438 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(Nifty) 116 పాయింట్ల నష్టంతో మొదలై మరో 26 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 143 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్(Sensex) 54 పాయింట్ల నష్టంతో 85,213 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 26,027 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,238 కంపెనీలు లాభపడగా 2,033 స్టాక్స్ నష్టపోయాయి. 178 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 132 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 150 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | ఆటోలో అమ్మకాలు..
ఎఫ్ఎంసీజీ సెక్టార్ రాణించగా.. ఆటో, టెలికాం స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ(FMCG) ఇండెక్స్ 0.56 శాతం, సర్వీసెస్ 0.51 శాతం, ఇండస్ట్రియల్ 0.50 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.47 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.46 శాతం లాభపడ్డాయి. టెలికాం (Telecom) 0.90 శాతం, ఆటో ఇండెక్స్ 0.87 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.37 శాతం, హెల్త్‌కేర్ 0.25 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం, మిడ్ క్యాప్(Mid cap) ఇండెక్స్ 0.16 శాతం పెరగ్గా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం నష్టపోయింది.
Stock Market | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 14 కంపెనీలు లాభాలతో ఉండగా.. 16 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
హెచ్‌యూఎల్ 1.37 శాతం, ట్రెంట్ 0.79 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.68 శాతం, ఆసియా పెయింట్ 0.53 శాతం, టాటా స్టీల్ 0.52 శాతం లాభపడ్డాయి.
Stock Market | Top losers..
ఎంఅండ్ఎం 1.94 శాతం, మారుతి 0.89 శాతం, అదాని పోర్ట్స్ 0.81 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 0.75 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.56 శాతం నష్టపోయాయి.