అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | ఆర్బీఐ ప్రయత్నిస్తున్నా రూపాయి పతనం ఆగడం లేదు. దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market)లో ఇటీవల నెట్ బయ్యర్లుగా మారుతున్నట్లు కనిపించిన ఎఫ్ఐఐలు.. తిరిగి పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. ఐటీ(IT) స్టాక్స్‌లో లాభాల స్వీకరణ కొనసాగుతోంది. దీంతో మార్కెట్లు నిలదొక్కుకోలేకపోతున్నాయి.
బుధవారం ఉదయం సెన్సెక్స్ 9 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 147 పాయింట్లు పడిపోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్దనుంచి కోలుకుని 352 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ(NIfty) 7 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 29 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో 95 పాయింట్లు ఎగబాకింది. ప్రధాన సూచీలు మధ్యాహ్నం తర్వాత తిరిగి నష్టాలబాట పట్టాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 116 పాయింట్ల నష్టంతో 85,408 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 26,142 వద్ద స్థిరపడ్డాయి.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,841 కంపెనీలు లాభపడగా 2,346 స్టాక్స్ నష్టపోయాయి. 145 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 115 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 102 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Markets | టెలికాం మినహా..
బీఎస్ఈలో కొన్ని ఇండెక్స్‌లు మాత్రమే గ్రీన్‌లో ముగిశాయి. టెలికాం (Telecom) ఇండెక్స్ 0.23 శాతం పెరగ్గా.. రియాలిటీ 0.09 శాతం, కమోడిటీ 0.05 శాతం లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.76 శాతం, సర్వీసెస్ 0.64 శాతం, ఐటీ ఇండెక్స్ 0.68 శాతం, ఎనర్జీ 0.58 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.47 శాతం, ఎఫ్ఎంసీజీ 0.42 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.37 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.14 శాతం నష్టంతో ముగిశాయి.
Stock Markets | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 13 కంపెనీలు లాభపడగా.. 17 కంపెనీలు నష్టపోయాయి. ట్రెంట్ 2.36 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.87 శాతం, మారుతి 0.66 శాతం, పవర్‌గ్రిడ్ 0.56 శాతం, ఎంఅండ్ఎం 0.34 శాతం పెరిగాయి.
Stock Markets | Top losers..
ఇండిగో 1.43 శాతం, సన్‌ఫార్మా 1.01 శాతం, ఆసియా పెయింట్ 0.83 శాతం, రిలయన్స్ 0.82 శాతం, హెచ్‌యూఎల్ 0.80 శాతం నష్టపోయాయి.