Homeక్రీడలుVolleyball | పాకిస్తాన్​పై భారత్​ విజయం

Volleyball | పాకిస్తాన్​పై భారత్​ విజయం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Volleyball | పాకిస్తాన్​(pakistan)పై భారత్​ విజయం సాధించింది. అద్భుత విజయం అందుకుంది.

ఉజ్బెకిస్తాన్​లో జరుగుతున్న సెంట్రల్​ ఏషియన్​ వాలీబాల్ అసోసియేషన్ (Asian Volleyball Association)​ నేషన్స్​ లీగ్​లో పాకిస్తాన్​పై భారత్ ఈ​ విజయం సాధించింది. 25–19, 25–19, 25–23 తేడాతో భారత్​ పాక్​ను చిత్తు చేసింది. ఈ లీగ్​లో భాగంగా భారత్​ ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడింది. ఇందులో మూడు మ్యాచుల్లో గెలుపొందగా.. మూడింటిని డ్రా చేసుకుంది. ఒక దాంట్లో ఓడిపోయింది.

వాస్తవానికి ఈ టోర్నీని పాకిస్తాన్​లో నిర్వహించాల్సి ఉంది. అయితే ఇటీవల భారత్​, పాకిస్తాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్​ ఆ దేశానికి వెళ్లడానికి నిరాకరించింది. దీంతో వేదికను ఉజ్బెకిస్తాన్​కు మార్చింది. తాజాగా పాక్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ ఘన విజయం సాధించింది.