HomeUncategorizedIndia pakisthan war | భారత్​ ప్రతీకార దాడి.. యుద్ధ విమానాలను కోల్పోవడంతో పాక్​ మొసలి...

India pakisthan war | భారత్​ ప్రతీకార దాడి.. యుద్ధ విమానాలను కోల్పోవడంతో పాక్​ మొసలి కన్నీరు

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: India pakisthan war : జమ్మూ, పఠాన్‌కోట్‌, ఉధంపూర్‌ సైనిక స్థావరాలపై పాక్​ దాడులకు తెగబడిందని భారత రక్షణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్​ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని పేర్కొంది. పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది.

కాగా, భారత ప్రతీకార దాడుల వల్ల రెండు JF-17 యుద్ధ విమానాలు కోల్పోయినట్లు పాకిస్తాన్​ అధికారికంగా ప్రకటించింది. ఇది తీవ్రమైన నష్టం అంటూ పాకిస్తాన్‌ భావోద్వేగంగా ప్రకటన చేసింది. ఈ ఘటనలో జవాన్లను సైతం కోల్పోయినట్లు పాక్​ పేర్కొంది. తాము యుద్ధం కోరుకోవడం లేదంటూ పాకిస్తాన్​ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోంది.