- Advertisement -
HomeUncategorizedInd - Pak | భారత్​ మరో కీలక నిర్ణయం.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్​

Ind – Pak | భారత్​ మరో కీలక నిర్ణయం.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ind – Pak | జమ్మూ కశ్మీర్​ (jammu kashmir)లోని పహల్​గామ్​ (pahalgam)లో పర్యాటకులపై ఉగ్రదాడి terror attack తర్వాత భారత్ bharat​ తీసుకునే నిర్ణయాలతో పాకిస్తాన్​​ pakistan ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. దీంతో భారత్​ యుద్ధ సన్నాహాలు చేస్తూనే.. పాక్​పై ఆర్థిక యుద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్​కు అప్పు పుట్టకుండా ఐఎంఎఫ్​ దగ్గర భారత్​ అభ్యంతరం తెలిపింది.

Ind – Pak | పూర్తిగా వాణిజ్యం రద్దు

ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్​ పాక్​తో వాణిజ్యాన్నిTrades నిలిపివేయడంతో పాటు, సింధూ నది Indus River జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. వ్యవసాయం, సాగుకు కీలకమైన సింధూ నది జలాలు రాకపోతే పాక్​ ఏడారిగా మారడం ఖాయం. ఇంతలోనే భారత్​ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్​తో పూర్తిగా వాణిజ్యం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

ఇప్పటికే వాణిజ్యం రద్దయినా.. పరోక్షంగా పాక్​ నుంచి ఎగుమతులు, దిగుమతులు సాగుతున్నాయి. తాజాగా వీటిని కూడా నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. దొడ్డిదారిన పాక్ వస్తువులు దేశంలోకి రాకుండా పరోక్ష దిగుమతులను ప్రభుత్వం బ్యాన్​ చేసింది. దీంతో ఆ దేశం మరిన్ని కష్టాలు ఎదుర్కోనుంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News