అక్షరటుడే, వెబ్‌డెస్క్: Economic Survey 2026 | భారత వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.8 – 7.2 శాతం ఉంటుందని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి (GDP growth) 7.4 శాతం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) గురువారం ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను (Economic Survey) ప్రవేశ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. వాణిజ్య విచ్ఛిన్నం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఆర్థిక దుర్బలత్వాల కారణంగా ప్రతికూల ప్రమాదాలు తీవ్రమవుతున్నప్పటికీ, భారతదేశ వృద్ధి అంచనా కంటే మెరుగ్గా ఉందని సర్వే తెలిపింది. ప్రపంచ వాణిజ్య చర్యల నుంచి ఒత్తిళ్లను సర్వే గుర్తించింది.
Economic Survey 2026 | బంగారం ధరలపై..
బంగారం, వెండి (gold and silver) వంటి విలువైన లోహాల ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితిని ప్రతిబింబిస్తుందని సర్వే పేర్కొంది. బలహీనపడుతున్న US డాలర్, నిరంతరం ప్రతికూల వాస్తవిక వడ్డీ రేట్ల అంచనాలు, పెరిగిన భౌగోళిక రాజకీయ, ఆర్థిక టెయిల్ రిస్క్‌ల మధ్య 2025లో బంగారం ధరలు బాగా పెరిగాయని సర్వే పేర్కొంది. ఈ లోహాలలో ధరల కదలికలు దేశీయ డిమాండ్-సరఫరా డైనమిక్స్ కంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ద్వారా ఎక్కువగా ఆధారపడి ఉందని తెలిపింది. బంగారం, వెండి మినహా తగ్గిన ప్రధాన ద్రవ్యోల్బణం దేశీయ ఆర్థిక వ్యవస్థలో సరఫరా వైపు పరిస్థితులను బలోపేతం చేస్తుందని సర్వే నివేదికలో ఉంది.
రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 4 శాతం కంటే ద్రవ్యోల్బణం తక్కువగా ఉందని తెలిపింది. దేశీయంగా వినియోగం ఊపందుకోవడంతో ఆర్థిక వ్యవస్థ బలంగా మారిందని పేర్కొంది. ఈ రెండు అంశాలు భారత ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని ఆర్తిక మంత్రి తెలిపారు. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు.