అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Foreign exchange reserves | భారత విదేశీ కరెన్సీ (India foreign currency) నిల్వలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత వారంతో పోలిస్తే 8.053 బిలియన్ డాలర్లు పెరిగి 709.413 బిలియన్ డాలర్లకు (billion dollars) చేరాయి. ఇది అల్ టైం హై కావడం గమనార్హం.
విదేశీ మారక నిల్వలు జనవరి 23 నాటికి 709.41 బిలియన్ డాలర్లకు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) శుక్రవారం తెలిపింది. దేశీయ మార్కెట్లలోకి రూపాయి ద్రవ్య లభ్యతను పెంచడానికి కేంద్ర బ్యాంకు ఫారెక్స్ స్వాప్‌లను నిర్వహించడం, బంగారు నిల్వల విలువ పెరగడంతో గత రెండు వారాలుగా ఫారెక్స్ నిల్వలు వేగంగా పెరిగాయి. ఆర్బీఐ బంగారు నిల్వల విలువ ఇప్పుడు 123 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది వారంలో 5.6 బిలియన్ డాలర్లు పెరిగింది.
Foreign exchange reserves | డాలర్ల అమ్మకం
డాలర్‌తో భారత రూపాయి విలువ ఇటీవల భారీగా పడిపోతుంది. రోజు రోజుకు రూపాయి క్షీణిస్తుండటంతో ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డాలర్లను విక్రయించడం చేపడుతోంది. అయినా కూడా విదేశీ మారక నిల్వలు పెరగడం గమనార్హం. డాలర్ల అమ్మకాల ప్రభావం, బంగారం వంటి ఆస్తుల పెరుగుతున్న విలువ, దీర్ఘకాలిక ఫారెక్స్ స్వాప్‌ల కారణంగా భర్తీ అయింది. ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు 33 మిలియన్ డాలర్లు పెరిగి 18.73 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది. యూరో, జపనీస్ యెన్ వంటి కరెన్సీల విలువ పెరగడం వల్ల డాలరేతర ఆస్తుల విలువ పెరగడంతో విదేశీ మారక నిల్వలు పెరుగుతున్నాయి అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ సాక్షి గుప్తా తెలిపారు.