అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydrogen Train | భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు త్వరలో పరుగులు పెట్టనుంది. హర్యానా (Haryana)లోని జింద్-సోనీపత్ మధ్య సేవలు అందించడానికి సిద్ధం అయింది.
హర్యానాలోని జింద్-సోనేపట్ మార్గంలో హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు త్వరలో ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో దీనిని రూపొందించారు. హైడ్రోజన్ రైలు జింద్– సోనేపట్ మధ్య 89 కి.మీ.ల దూరం నడుస్తోంది. జింద్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ (Green Hydrogen Plant) ద్వారా శక్తిని పొందుతుంది. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 3వేల కిలోగ్రాముల నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. హర్యానా ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి చండీగఢ్‌లోని దక్షిణ హర్యానా బిజ్లి విత్రాన్ నిగమ్ (DHBVN) అధికారులతో విద్యుత్ ఏర్పాట్లను సమీక్షించారు.
Hydrogen Train | కాలుష్య రహితం
డీజిల్ ఇంజిన్లను హైడ్రోజన్ ఇంధన కణాలతో భర్తీ చేయడం ద్వారా, రైలు నీటి ఆవిరి, వేడిని మాత్రమే విడుదల చేస్తుంది. కాలుష్య రహితంగా మారనుంది. గ్రీన్ రైల్ టెక్నాలజీ (Green Rail Technology)లో జర్మనీ, చైనా వంటి దేశాల సరసన భారత్ నిలవనుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైడ్రోజన్ ట్రైన్ ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. గంటకు 150 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఇది వెళ్లగలదు.