HomeUncategorizedAkash Missile | భార‌త్ బ్ర‌హ్మాస్త్రం ఆకాశ్‌.. పాక్‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన మిస్సైల్‌

Akash Missile | భార‌త్ బ్ర‌హ్మాస్త్రం ఆకాశ్‌.. పాక్‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన మిస్సైల్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Akash Missile | క‌య్యానికి కాలు దువ్విన పాకిస్తాన్‌ Pakistanకు భార‌త్ Bharat త‌గిన బుద్ధి చెప్పింది. త‌న అధునాత‌న ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌తో Defence system నాలుగు రోజుల‌కే శ‌త్రువును మోకాళ్ల మీద కూర్చోబెట్టింది. అణుబాంబులు ఉన్నాయ‌ని బెదిరించిన దేశాన్ని కాల్పుల విర‌మ‌ణ పాట పాడించేలా చేసింది. సైనిక‌ప‌రంగా, రాజ‌కీయంగా, భౌగోళికంగా అన్ని వైపుల నుంచి అంత‌లా ఒత్తిడి తెచ్చింది. అస్త్ర శ‌స్త్ర ప‌రాక్ర‌మాల‌తో భార‌త్ చూపిన తెగువ ఇప్పుడు విశ్వ‌వ్యాపిత‌మైంది. పాకిస్తాన్‌తో పాటు దాని వెనుక ఉన్న చైనా Chinaకు కంట‌గింపుగా మారిన ఇండియా స‌త్తా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే, ఇందులో ప్ర‌ధానంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నది ఆకాశ్ మిస్సైల్‌ akash missile. అత్యంత క‌చ్చిత‌త్వంతో ల‌క్ష్యాన్ని ఛేదించిన ఆకాశ్ సామ‌ర్థ్యంపైనే చ‌ర్చ జ‌రుగుతోంది.

Akash Missile | శ‌త్రువుల‌కు చుక్క‌లు..

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో pahalgam terror attack 26 అమాయ‌క ప‌ర్యాట‌కుల‌ను ఊచ‌కోత కోయ‌డం దేశాన్ని క‌దిలిచింది. సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోస్తున్న పాకిస్తాన్‌కు త‌గిన బుద్ధి చెప్పాల‌ని యావ‌త్ భార‌తావ‌ని నిన‌దించింది. ఈ త‌రుణంలో భార‌త్ అనేక ర‌కాలుగా దాయాదిపై ఒత్తిడి తెచ్చింది. అదే స‌మ‌యంలో ఉగ్ర‌వాదుల పీచ‌మ‌ణిచేందుకు ఆపరేషన్ సిందూర్ operation sindoor పేరుతో ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. నిర్ణ‌యించిన ముహూర్తం ప్ర‌కారం.. మే 6వ తేదీన పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు మరణించారు.

అందుకు ప్రతిగా భారత్‌లోని సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలే లక్ష్యంగా పాక్ క్షిపణలు, డ్రోన్లతో దాడులు చేయ‌గా, మ‌న సైన్యం స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టింది. భార‌త అమ్ములపొదిలోని అత్యాధునిక అస్త్రం ఆకాశ్ క్షిపణి‌ ద్వారానే శ‌త్రువుల ఎత్తుల‌ను చిత్తు చేసింది. మే 9, 10 తేదీల్లో.. అది రాత్రి వేళల్లో భారత్ మిలటరీ, పౌరులు నివసించే ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్థాన్ క్షిపణులతో pakistan missiles దాడులు చేసింది. ఈ దాడులను ఆకాశ్ క్షిపణులు తిప్పికొట్టాయి. భారత్‌పై పాక్ ప్రయోగించిన డ్రోనులు, క్షిపణలతోపాటు మైక్రో యూఏవీలను సైతం ఈ క్షిపణి అడ్డుకొంది. వాతావరణం, భూభాగంతోపాటు రాడార్ నుంచి డేటాను సంగ్రహించి అప్పటికప్పుడు స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ దాడులను ఈ క్షిపణులు తిప్పికొట్టాయి. ఈ తరహా క్షిపణిని ఇప్పటి వరకు చూడలేదని శత్రు దేశమైన పాకిస్థాన్ సైతం ప్రకటించిందంటే.. ఆకాశ్ సామ‌ర్థ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు.

Akash Missile | హైద‌రాబాద్‌లోనే త‌యారీ..

భార‌త సైన్యానికి indian army వెన్నెముక‌గా నిలిచిన ఆకాశ్ క్షిపణి హైద‌రాబాద్‌ hyderabadలోనే రూపొందింది. ఇక్క‌డి భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌ BDL సంస్థ దీన్ని తయారీ చేసింది. ఈ క్షిపణి రూప‌క‌ల్ప‌న‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా తెలుగు శాస్త్రవేత్త డాక్టర్ ప్రహ్లాద రామారావు వ్యవహరించారు. ఆకాశ్ అనేది ఆత్మ నిర్భర భారత్‌ను ప్రదర్శించే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన రక్షణ వ్యవస్థ. ఆ క్రమంలో శత్రు దేశాల ఎయిర్ క్రాఫ్ట్‌లు, డ్రోనులు, క్షిపణులను పసిగట్టడంలో ఆకాశ్‌కు వేరే ఏదీ సాటి లేదు. చైనా నుంచి పాకిస్థాన్ దిగుమతి చేసుకున్న హెచ్‌క్యూ 9, హెచ్‌క్యూ 16 క్షిపణులను భారత్‌కు చెందిన ఆకాశ్ క్షిపణిలు ధ్వంసం చేశాయంటేనే ఆకాశ్ ప‌నితీరును ఊహించుకోవ‌చ్చు. రాడార్ సిస్టమ్స్, సెన్సార్లు, కమ్యూనికేషన్ టెక్నాలజీ తదితర అంశాలు ఈ క్షిపణులతో అనుసంధానించాయి. దీంతో రియల్ టైమ్ మల్టీ సెన్సార్డ్ డేటా ప్రాసెసింగ్‌తోపాటు దాడి తీవ్రతను అంచనా వేయగలదు. ఏ దిశ నుంచి దాడులు సంభవించినా.. వాటిని ఒకే సారి ఛేదించగలగడం ఈ క్షిపణుల ప్రత్యేకత.