ePaper
More
    Homeఅంతర్జాతీయంIndia-Bangladesh | బంగ్లాదేశ్‌కు భార‌త్ భారీ దెబ్బ‌.. 770 మిలియ‌న్ డాల‌ర్ల దిగుమ‌తుల‌పై ప్ర‌భావం

    India-Bangladesh | బంగ్లాదేశ్‌కు భార‌త్ భారీ దెబ్బ‌.. 770 మిలియ‌న్ డాల‌ర్ల దిగుమ‌తుల‌పై ప్ర‌భావం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: India-Bangladesh | తోక జాడిస్తున్న బంగ్లాదేశ్‌కు భార‌త్ (india) గ‌ట్టిగా బుద్ధి చెప్పింది. ఆ దేశం నుంచి వ‌చ్చే దిగుమ‌తుల‌పై ఇటీవ‌ల ఆంక్ష‌లు విధించింది. పైగా బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చే దిగుమతులను భూ పోర్టుల (land ports) ద్వారా పరిమితం చేయాలనే ఇండియా ఆ దేశానికి గ‌ట్టిగానే త‌గల‌నుంది. దాదాపు 770 మిలియన్ డాల‌ర్ల (770 million dolars) విలువైన వస్తువులపై భార‌త నిర్ణ‌యం ప్రభావితం చూపుతుంద‌ని భావిస్తున్నారు. ఇది మొత్తం ద్వైపాక్షిక దిగుమతుల్లో దాదాపు 42 శాతం అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (Global Trade Research Initiative) నివేదిక తాజాగా వెల్ల‌డించింది. బంగ్లాదేశ్ నుంచి దిగుమ‌త‌య్యే వస్తువులపై(goods import) కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం తక్షణ ఆంక్షలు విధించింది. వాటిని నిర్దిష్ట సముద్ర పోర్టులకే (sea ports) పరిమితం చేసింది. లేదా పూర్తిగా భూమార్గాల ద్వారా వాటి ప్రవేశాన్ని నిషేధించింది.

    India-Bangladesh | పోర్టుల ద్వారా మాత్ర‌మే రాక‌..

    షేక్ హ‌సీనా ప్ర‌భుత్వాన్ని (sheikh hasina government) కూల‌దోసిన త‌ర్వాత అక్క‌డ కొలువుదీరిన తాత్కాలిక ప్ర‌భుత్వం భార‌త వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. ఇండియాకు శ‌త్రువులైన చైనా, పాకిస్తాన్‌ల‌కు (china and pakistan) ద‌గ్గ‌ర‌వుతోంది. ఇటీవ‌ల చైనా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన బంగ్లా తాత్కాలిక సార‌థి మ‌హ‌మ్మ‌ద్ యూన‌స్ (muhammad yunus) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బంగ్లా తోక జాడిస్తుండ‌డంతో భార‌త్ క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ఆ దేశం నుంచి వ‌చ్చే వస్త్రాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఆంక్ష‌లు విధించింది. కొత్త నిబంధనల ప్రకారం సంవత్సరానికి 618 మిలియన్ డాల‌ర్ల విలువైన బంగ్లాదేశ్ వస్త్రాలు (bangladeshi textiles) ఇప్పుడు రెండు సముద్ర పోర్టుల (sea ports) ద్వారా మాత్రమే భారతదేశంలోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. గతంలో, ఈ ఎగుమతులకు (export) భూ మార్గాల ద్వారా వ‌చ్చేవి.

    India-Bangladesh | బంగ్లా ఆదాయానికి గండి..

    భార‌త నిర్ణ‌యం వ‌ల్ల బంగ్లాదేశ్ ఆదాయానికి (bangladesh revenue) భారీగా గండి పడుతుంద‌ని (GTRI) వెల్ల‌డించింది. ఇండియా నిర్ణ‌యం బంగ్లాదేశ్ అత్యంత లాభదాయక ఎగుమతి మార్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొంది. బంగ్లాదేశ్ ఎగుమతిదారులు (bangladeshi exporters) అన్యాయమైన ప్రయోజనాన్ని పొందుతున్నారని భారతీయ వస్త్ర తయారీదారులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. బంగ్లా వ్యాపారులు (bangladesh traders) గణనీయమైన ప్రభుత్వ సబ్సిడీల నుంచి ప్రయోజనం పొందుతున్నారని నివేదిక తెలిపింది. మ‌రోవైపు, బంగ్లాదేశ్ సొంత వాణిజ్య ఆంక్షల కారణంగా భారతదేశ ఎగుమతిదారులకు కూడా నష్టం వాటిల్లుతుంద‌ని భావిస్తున్నారు. 2024 చివరి నుంచి ఢాకా భారత ఎగుమతులపై వరుస ఆంక్షలు విధించింది. ఐదు ప్రధాన భూ ఓడరేవుల ద్వారా నూలు దిగుమతులపై నిషేధం నుంచి బియ్యంపై కఠినమైన నియంత్రణలు విధించింది. అలాగే, కాగితం, చేపలు, పొగాకు, పాలపొడి వంటి వస్తువులపై ఆంక్ష‌లు పెట్టింది. బంగ్లాదేశ్ తన భూభాగం గుండా ప్రయాణించే భారతీయ వస్తువులపై కిలోమీటరుకు టన్నుకు 1.8 టాకా రవాణా రుసుమును కూడా ప్రవేశపెట్టింది. దీని వ‌ల్ల భార‌త్ తాజాగా చ‌ర్య‌లు చేప‌ట్టింది.

    More like this

    Karnataka | ఇదేం విచిత్రం.. పులిని పట్టలేదని.. అటవీ సిబ్బందిని బోనులో బంధించిన గ్రామస్తులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో పులి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుండా, అటవీ శాఖ...

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...

    CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కలకలం.. తుపాకితో బెదిరించి దోపిడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బార్బడోస్‌లో...