అక్షరటుడే, వెబ్‌డెస్క్: Team india | సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం జట్టును ప్రకటించింది.
అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన భారత టీమ్‌ను ఎంపిక చేసింది. మధ్యాహ్నాం 1:30 గంటలకు జట్టు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, వర్షం కారణంగా బీసీసీఐ సెక్రటరీ జట్టును సకాలంలో ప్రకటించలేకపోయారు. దాంతో అధికారిక ప్రకటనకు గంట ఆలస్యం అయ్యింది. ఇక టీ 20 జట్టు కెప్టెన్‌గా సూర్య కుమాయాదవ్ (Surya Kuma Yadav) ఉండనుండగా, వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ని ఎంపిక చేశారు. అయితే గిల్ మళ్లీ టీ20 ఫార్మాట్‌లో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.
Team india | అయ్యర్‌కి మొండిచేయి..
టెస్టు ఫార్మాట్‌లో (Test Format) అద్భుతంగా రాణించిన గిల్‌కు ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే ఐపీఎల్‌లో మెరిసిన కేఎల్ రాహుల్ (KL Rahul), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) లాంటి స్టార్ ప్లేయర్లు ఆసియా కప్‌కి ఎంపిక కాకపోవడం అభిమానుల్లో అసంతృప్తికి దారి తీసింది. ముఖ్యంగా వీరిలో శ్రేయస్ ఎంపికపై ఖచ్చితంగా ఆశలు పెట్టుకున్నవారు నిరాశ చెందారు. ఇక గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత మళ్లీ టీ20 ఫార్మాట్‌కు తిరిగొచ్చాడు జస్‌ప్రీత్ బుమ్రా. అలానే స్పిన్ విభాగంలో తన స్థానాన్ని తిరిగి సంపాదించుకున్నాడు కుల్దీప్ యాదవ్.
సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. అబుదాబి, దుబాయ్ వేదికగా మొత్తం 19 మ్యాచ్‌లు జరగనుండగా, సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. ఇక సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో Pakistan పోరుకి దిగనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై క్రీడా అభిమానులకు ఎలాంటి ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓమన్‌తో కూడా భారత్ ఓ మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది.
Team india | ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టు చూస్తే..
బ్యాటర్లు : సూర్యకుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అభిషేక్ శర్మ
వికెట్ కీపర్లు : సంజూ సామ్సన్, జితేశ్ శర్మ
ఆల్ రౌండర్లు : హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే
స్పిన్నర్లు : కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
పేసర్లు : బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్
ఆసియా కప్ టి20 ఫార్మాట్‌లో పాల్గొనే భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజూ సామ్సన్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్
