ePaper
More
    HomeజాతీయంIndia-Pakistan | పాకిస్తాన్‌పై భార‌త్ మ‌రో అస్త్రం.. అన్ని ర‌కాల దిగుమ‌తుల‌పై నిషేధం

    India-Pakistan | పాకిస్తాన్‌పై భార‌త్ మ‌రో అస్త్రం.. అన్ని ర‌కాల దిగుమ‌తుల‌పై నిషేధం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: India-Pakistan | జ‌మ్మూకాశ్మీర్‌లోని Jammu and Kashmir పహల్​గామ్​ ఉగ్రదాడి Pahalgam terror attack తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలు దిగజారాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం central government పాకిస్థాన్‌ను అన్ని విధాలుగా అష్ట‌దిగ్బంధనం చేసే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇప్ప‌టికే అన్ని ర‌కాల దౌత్య సంబంధాలు diplomatic relations తెంపేసుకున్న భార‌త్.. ఇప్పుడు తాజాగా అన్ని రకాల దిగుమతులపై imports నిషేధం విధించింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిషేధం వెంటనే అమలులోకి వస్తుందని వెల్ల‌డించింది. రవాణాలో ఉన్న వస్తువులతో సహా పాకిస్థాన్ నుంచి వచ్చే లేదా ఆ దేశం నుంచి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులపై ఈ నిషేధం వర్తిస్తుంది.

    India-Pakistan | నిలిచిపోయిన వాణిజ్యం

    సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను అన్ని విధాలుగా దెబ్బ తీసేందుకు భార‌త్ India చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే ఆ దేశంతో పౌర‌, వాణిజ్య civil and trade సంబంధాల‌ను నిలిపి వేసింది. తాజాగా దిగుమతుల‌పైనా నిషేధం విధించింది. పాకిస్థాన్‌లో లేదా అక్కడి నుంచి ఎగుమతి చేయబడిన అన్ని వస్తువుల దిగుమతి goods imports లేదా రవాణా అన్నీ కూడా వెంటనే నిషేధించబడతాయి. ఈ నిషేధానికి మినహాయింపు కోసం భారత india ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరమని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పాకిస్తాన్ పై Pakistan మరో కఠినమైన చర్యలో భాగంగా, పహల్​గామ్​ ఉగ్రవాద దాడి Pahalgam terror attack నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారతదేశం పొరుగు దేశం నుండి వచ్చే అన్ని దిగుమతులను నిషేధించింది. జాతీయ భద్రత national security దృష్ట్యా పాకిస్తాన్ నుంచి వ‌చ్చే అన్ని ఉత్పత్తులకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం government స్ప‌ష్టం చేసింది.

    India-Pakistan | మ‌న‌పై ప్ర‌భావం అంతంతే..

    పాకిస్తాన్ నుంచి భార‌త్‌కు దిగుమతి imports అయ్యే ప్రధానంగా ఔషధ ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజలు fruits and oilseeds ఉన్నాయి. 2019 పుల్వామా దాడి Pulwama attack తర్వాత భారతదేశం పాకిస్తాన్ ఉత్పత్తులపై 200% సుంకం విధించడంతో ఇది తగ్గింది. తాజా డేటా ప్రకారం ఇది ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. నివేదికల ప్రకారం, 2024-25లో మొత్తం దిగుమతుల్లో imports ఇది 0.0001% కంటే తక్కువగా ఉంది.

    India-Pakistan | స‌రిహ‌ద్దుల మూసివేత‌

    పహల్​గామ్‌లో Pahalgam 26 మంది అమాయ‌కుల‌ను ఉగ్ర‌వాదులు Terrorists ఊచ‌కోత కోశారు. ప్ర‌ధానంగా హిందూ ప‌ర్యాట‌కుల‌నే ల‌క్ష్యంగా చేసుకుని కాల్పులు జ‌రిపారు. దీని వెనుక పాక్ ఆర్మీతో పాటు ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ intelligence agency ISI, ల‌ష్క‌రే తొయిబా ఉన్న‌ట్లు ఎన్ఐఏ ద‌ర్యాప్తులో NIA investigation వెలుగు చూసింది. ఉగ్ర దాడి త‌ర్వాత భార‌త్ అనేక ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగింది. పాకిస్తాన్‌తో pakistan ఉన్న ఏకైక వాణిజ్య మార్గం వాఘా-అట్టారి సరిహద్దును Wagah-Attari border మూసివేసింది. పాక్ పౌరుల‌ను Pakistani citizens భార‌త్ నుంచి పంపించేసింది. పొరుగు దేశం విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం విధించింది. వీటికంటే అత్యంత ముఖ్య‌మైన‌ది సింధు జ‌లాల నిలిపివేత‌. పాక్‌కు ప్రాణాధార‌న‌మైన సింధు జ‌లాల Indus water నిలిపివేత‌తో అక్క‌డి ప్ర‌జ‌లు పాక్ స‌ర్కారుపై Pakistani government ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారు.

    More like this

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని...

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...