అక్షరటుడే, వెబ్‌డెస్క్:India – China | చైనా వైఖరిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ విషయంతో డ్రాగన్ దేశానికి కౌంటర్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)లోని పలు ప్రాంతాల పేర్లను చైనా తన మ్యాప్‌లో మార్చింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. పేర్లు మార్చినంత సులువుగా నిజాలను మార్చలేరని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని పేర్కొంది.
అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టడానికి చైనా యత్నించడాన్ని తాము గమనించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్(Randhir Jaiswal) తెలిపారు. అలాంటి ప్రయత్నాలను తాము తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం అని, పేర్లు మార్చినంత మాత్రాన ఈ నిజాన్ని మార్చలేరని ఆయన అన్నారు. గతంలో సైతం చైనా ఇలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లు మారుస్తూ జాబితా విడుదల చేసింది. అయితే భారత్(Bharath) చైనా తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతోంది.
India – China | ఆ దేశ ఎక్స్ ఖాతాపై నిషేధం
భారత్ చైనాకు మరో షాక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన గ్లోబల్ టైమ్స్ ఎక్స్ అకౌంట్(Global Times X Account) నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై గ్లోబల్ టైమ్స్ ఫేక్ ప్రచారం చేసిందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఆపరేషన్ సిందూర్ అనంతర ఉద్రిక్తతల వేళ చైనా పాక్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. పాకిస్తాన్(Pakistan) భూభాగాన్ని భారత్ ఆక్రమిస్తే తాము చూస్తూ ఊరుకోమని చైనా పేర్కొంది.