ePaper
More
    Homeఅంతర్జాతీయంIran - Israel | ఇరాన్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు

    Iran – Israel | ఇరాన్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran – Israel | ఇరాన్​– ఇజ్రాయెల్(Iran – Israel)​ మధ్య యుద్ధం కొనసాగుతోంది. నిత్యం ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. దీంతో బాంబుల మోతతో ఆ దేశాల్లోని నగరాలు దద్దరిల్లుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్​లో ఉన్న భారతీయులు(Indians) ఆందోళన చెందుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం(Central Government) వారిని స్వదేశానికి తరలిస్తోంది.

    పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్​, ఇజ్రాయెల్​లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇరాన్​లో ఉన్న భారతీయులను కేంద్రం స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా అర్మేనియా(Armenia) నుంచి తొలి విమానం గురువారం ఉదయం భారత్​కు చేరుకుంది. 110 మంది భారతీయులు ఢిల్లీ ఎయిర్​పోర్ట్​(Delhi Airport)కు చేరుకున్నారు.

    ఇరాన్​లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్​ ఆపరేషన్​ రైజింగ్​ లయన్(Operation Rising Lion)​ పేరిట దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్​ సైతం టెల్​అవీవ్​పై బాంబులతో విరుచుకుపడింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. యుద్ధం మొదలైందని ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతుల్లా ఖమేనీ(Iran Supreme Leader Ayatollah Khamenei) ప్రకటించారు. దీంతో ఆ దేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం కేంద్రం చర్యలు చేపట్టింది.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...