అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America | సగటు భారతీయుడి కల అమెరికా. చదువుకుంటున్న యువత మోజంతా అగ్ర రాజ్యంపైనే ఎక్కువగా ఉంది. విద్య, ఉద్యోగ (Job and education) అవకాశాల కోసం అమెరికా వెళ్లాలి.. అక్కడే స్థిరపడాలన్నదే లక్ష్యంగా యువతరం కష్టపడుతోంది. దీంతో భారతీయులు (Indians) అత్యధిక వలస వెళ్లిన దేశంగా అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశానికి వలస వెళ్లిన భారతీయుల సంఖ్య 44.60 లక్షలకు చేరింది. అమెరికా (America) తర్వాత ఇండియన్లు అత్యధికంగా వలస వెళ్లిన దేశం దుబాయ్(Dubai). ఈ దేశానికి వెళ్లిన మనోళ్లలో విద్యావంతుల కంటే కార్మికుల సంఖ్యే ఎక్కువగా ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ దేశానికి వలసలు కొనసాగుతున్నాయి.
America | పది దేశాల్లో రెండు కోట్లకు పైగా..
వివిధ పనుల నిమిత్తం ఇండియన్లు విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు. విద్య(education), ఉద్యోగ, ఉపాధి అవకాశాల(employment opportunities) కోసం చాలా మంది విదేశాల బాట పడుతున్నారు. విదేశాల్లో చదువుకుని, అక్కడే స్థిరపడాలన్నదే ప్రస్తుత యువత ఆలోచనగా ఉంది. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ (bachelor degree) పూర్తి చేయగానే, మాస్టర్స్ చదివేందుకు వలస వెళ్తున్నారు. ఇక, ఉపాధి కోసం వెళ్లే వారి భారతీయుల సంఖ్య గత రెండు దశాబ్దాలుగా భారీగా పెరిగింది. పాశ్యాత్య దేశాలతో పాటు గల్ఫ్ దేశాల్లో మనోళ్లు ఎక్కువగా ఉంటున్నారు. కేవలం పది దేశాల్లోనే రెండు కోట్లకు పైగా భారతీయులు నివాసం ఉంటున్నారు. ఇండియన్లు అత్యధికంగా వలస వెళ్లిన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. 44.60 లక్షల మంది ఇండియన్లు విద్య ఉద్యోగ నిమిత్తం అమెరికా బాట పట్టారు. యూఎస్ తర్వాత భారతీయులు అత్యధిక వలస వెళ్లిన జాబితాలో దుబాయ్ (34.25 లక్షలు) రెండో స్థానంలో ఉంది. మలేషియా (29.87 లక్షలు), సౌదీ అరేబియా(29.87 లక్షలు), మయన్మార్(20 లక్షలు), యూకే(17.60 లక్షలు), కెనడా(16.80 లక్షలు), శ్రీలంక(16.14 లక్షలు), సౌతాఫ్రికా(15.60 లక్షలు), కువైట్ (10.29 లక్షలు) వంటి దేశాల్లోనూ ఇండియన్లు ఎక్కువగానే ఉన్నారు.
America | అమెరికాకే జై..
ఇండియాలో (India) చదువుకున్న వారు అత్యధికంగా అమెరికాకు (America) వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. అగ్ర రాజ్యంలో స్థిరపడాలన్న ఆలోచనతోనే అడుగులు వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్(Donalad Trump) అమెరికాకు రెండో సారి అధ్యక్షుడయ్యాక వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసలను దేశం నుంచి పంపించేస్తున్న ఆయన.. వీసా నిబంధనలు కఠినతరం చేశారు. అయినప్పటికీ, భారతీయులు అగ్ర రాజ్యం వైపే మొగ్గు చూపుతున్నారు.