Homeక్రీడలుIndian women cricket team | భారత మహిళా క్రికెట్ జట్టుపై వెల్లివిరుస్తున్న ప్ర‌శంస‌ల జల్లు

Indian women cricket team | భారత మహిళా క్రికెట్ జట్టుపై వెల్లివిరుస్తున్న ప్ర‌శంస‌ల జల్లు

Indian women's cricket team | సౌతాఫ్రికా మ‌రోసారి నిరాశ‌ప‌రిచింది. ఫైన‌ల్‌లో చ‌తికిల‌ప‌డింది. దీంతో భార‌త్ క‌ప్ ఎగ‌రేసుకుపోయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో గెలిచిన ఈ ప్రపంచ కప్ భారత్‌కు కేవలం క్రీడా గౌరవమే కాదు , ప్రతి భారతీయురాలి స్ఫూర్తికి చిహ్నంగా నిలిచింది.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian women’s cricket team | భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్‌ 2025ను కైవసం చేసుకుంది. ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాపై South Africa52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, దేశాన్ని గర్వపడేలా చేసింది.

మూడో ప్రయత్నంలో ప్రపంచ కప్ కిరీటం ఎత్తిన భారత్, మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసింది. గతంలో రెండు సార్లు ఫైనల్ దశకు చేరుకున్నప్పటికీ ఓటమి పాలైన భారత్, ఈసారి హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో విజేతగా నిలిచింది.ఈ క్ర‌మంలో ప‌లువురు ప్ర‌ముఖులు టీమిండియాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Indian women’s cricket team | ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ Narendra Modi మహిళా జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “ఐసిసి మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు ప్రదర్శన అద్భుతం. ఈ విజయం నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, జట్టుకృషి మరియు పట్టుదలకు నిదర్శనం. ఈ చారిత్రాత్మక విజయంతో దేశ యువతకు ప్రేరణ లభించింది,” అని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కూడా మహిళా జట్టు విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.“మన అమ్మాయిలు మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశారు. వారి దృఢ సంకల్పం, అజేయ స్ఫూర్తి, జట్టుకృషి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఇది భారత మహిళా క్రీడలకు మైలురాయి,” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి Revanth Reddy కూడా జట్టు విజయాన్ని ప్రశంసించారు.“దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితమైన ఫైనల్లో భారత్ విజయం సాధించడం చారిత్రాత్మకం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వం, జట్టు ధైర్యసాహసం, ఐక్యత, పోరాటస్ఫూర్తి అన్నీ కలిసి ఈ విజయం సాధించాయి. దశాబ్దాల కలను సాకారం చేసిన మా క్రీడాకారిణులకు అభినందనలు,” అని రేవంత్ రెడ్డి అన్నారు. భారత మహిళల విజయం నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు అంబ‌రాన్నంటాయి. స్టేడియం నుంచి వీధుల వరకూ “భారత్ మాతా కి జై” నినాదాలు మార్మోగాయి. సోషల్ మీడియాలో అభిమానులు, ప్రముఖులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.