అక్షరటుడే, వెబ్‌డెస్క్ : World Cup Final | మహిళా వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సౌత్ ఆఫ్రికా (South Africa)తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు రాణించింది. మొదట టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్లు రాణించడంతో 50 ఓవర్లలో 298 స్కోర్ చేసింది.
వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు స్మృతి మందాన(45), షెఫాలీ వర్మ (87) రాణించారు. వీరి తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సెమీ ఫైనల్లో మ్యాచ్ గెలిపించిన జెమీమా వన్ డౌన్లో వచ్చి పర్వాలేదనిపించింది. 37 బంతుల్లో ఆమె 24 పరుగులు చేసింది. షెఫాలీ తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. కెప్టెన్ హర్మీన్ ప్రీత్ కౌర్ 20 పరుగులతో నిరాశ పరిచింది. అమ్జోత్ కౌర్ 12 పరుగులకే అవుట్ అయింది. దీప్తి శర్మ (58) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. రిచా గోష్ 24 బంతుల్లో 34 పరుగులతో చివర్లో మెరుపులు మెరిపింది. దీంతో భారత్ 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది.
World Cup Final | బౌలర్లు రాణిస్తే..
సౌత్ ఆఫ్రికా బౌలర్లు అయబోగా ఖక 3, నాన్కులులేకో మ్లాబా, క్లెర్క్, చోలె ట్రయన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ తొలిసారి ప్రపంచ కప్ గెలుచుకుంటుంది. గతంలో రెండు సార్లు ఫైనల్ వరకు వెళ్లిన భారత మహిళలు రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా గెలిచినా.. ఆ జట్టుకు తొలి కప్ కానుంది. భారత గెలుపు ఇక బౌలర్లపై ఆధారపడి ఉంది. ఆదిలోనే వికెట్లు తీస్తే భారత్ గెలుపు సులువు అవుతుంది.
