అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market Gains | భారత్, అమెరికాల మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఎఫ్ఐఐలలో సానుకూల దృక్పథాన్ని పెంచింది. దీంతోపాటు రూపాయి విలువ బలపడడం, క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం, గ్లోబల్ మార్కెట్లు (Global Markets) లాభాల బాటలో పయనిస్తుండడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది. దీంతో వరుసగా మూడో సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో ప్రారంభమై వెంటనే 147 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని తిరిగి 384 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ప్రారంభమై, అక్కడినుంచి 52 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 108 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 208 పాయింట్ల లాభంతో 84,273 వద్ద, నిఫ్టీ (Nifty) 67 పాయింట్ల లాభంతో 25,935 వద్ద స్థిరపడ్డాయి.
రాణిస్తున్న ఆటో, మెటల్ స్టాక్స్..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో ఆటో, మెటల్ స్టాక్స్ రాణిస్తున్నాయి. ఆటో, మెటల్, యుటిలిటీ, రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, ఐటీ ఇండెక్స్‌లు లాభాలతో ముగియగా.. ఫార్మా, కన్జూమర్ డ్యూరెబుల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ల స్టాక్స్ నష్టపోయాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,620 కంపెనీలు లాభపడగా 1,631 స్టాక్స్ నష్టపోయాయి. 156 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 127 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 56 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 16 స్టాక్స్ లాభాలతో, 14 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 5.19 శాతం, టాటా స్టీల్ 2.89 శాతం, ఎంఅండఎం 1.79 శాతం, పవర్‌గ్రిడ్ 1.69 శాతం, టెక్‌మహీంద్రా 1.66 శాతం లాభపడ్డాయి.
Top Losers : హెచ్‌సీఎల్ టెక్ 1.86 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.80 శాతం, ఎయిర్టెల్ 1.27 శాతం, ఆసియన్ పెయింట్ 0.77 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.55 శాతం నష్టపోయాయి.