అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market Recovery | గత సెషన్లో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market).. శుక్రవారం కోలుకుంది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు పరుగులు తీస్తున్నాయి.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 226 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 66 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి 768 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 27 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 241 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టంతో 83,898 వద్ద, నిఫ్టీ 140 పాయింట్ల నష్టంతో 25,594 వద్ద ఉన్నాయి.
పవర్, మెటల్ సెక్టార్లలో ర్యాలీ..
పవర్, మెటల్, యుటిలిటీ సెక్టార్లు కొనుగోళ్ల మద్దతుతో దూసుకువెళ్తున్నాయి. నిఫ్టీ (Nifty) పవర్ ఇండెక్స్ 1.8 శాతం పెరగ్గా.. క్యాపిటల్ గూడ్స్, మెటల్, యుటిలిటీ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభంతో ఉన్నాయి. బ్యాంకెక్స్, కన్జూమర్ డ్యూరెబుల్స్, ఎఫ్ ఎంసీజీ రంగాలూ రాణిస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ 0.6 శాతం నష్టంతో ఉంది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 23 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 7 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ 2.13 శాతం, ఎల్టీ 1.896 శాతం, హెచ్‌యూఎల్ 1.84 శాతం, బీఈఎల్ 1.70 శాతం, పవర్‌గ్రిడ్ 1.58 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 1.01 శాతం, టెక్‌మహీంద్రా 0.89 శాతం, ఎటర్నల్ 0.74 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.54 శాతం, ఎంఅండ్ఎం 0.47 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.