అక్షరటుడే, వెబ్ డెస్క్: Indian Stock Market | గత సెషన్లో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం కోలుకుంది. బ్యాంక్, మెటల్, ఎఫ్ఎంసీజీ సెక్టార్ల స్టాక్స్‌లో వాల్యూ బయ్యింగ్ కనిపించింది. భారత్, యూఎస్‌ల మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (Trade Deal) ఏప్రిల్‌నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్‌ను పెంచాయి.
అయితే ఇరాన్, యూఎస్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో చివరలో ఇన్వెస్టర్లు తిరిగి లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఐటీ సెక్టార్లో అమ్మకాలల ఒత్తిడి కొనసాగింది.
నష్టాలతో ప్రారంభమైనా..
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 226 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 66 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి 926 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 27 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి 284 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 316 పాయింట్ల లాభంతో 82,814 వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల లాభంతో 25,571 వద్ద స్థిరపడ్డాయి.
పవర్, మెటల్ సెక్టార్లలో ర్యాలీ..
పవర్, మెటల్, యుటిలిటీ సెక్టార్లు కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. నిఫ్టీ (Nifty) పవర్ ఇండెక్స్ 1.91 శాతం, యుటిలిటీ 1.53 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.51 శాతం, మెటల్ ఇండెక్స్ 1.25 శాతం పెరిగాయి. బ్యాంకెక్స్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జూమర్ డ్యూరెబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలూ లాభాలతో ముగిశాయి. ఐటీ ఇండెక్స్ 0.98 శాతం, మీడియా ఇండెక్స్ 0.28 శాతం నష్టపోయాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,917 కంపెనీలు లాభపడగా 2,265 స్టాక్స్ నష్టపోయాయి. 167 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 82 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 204 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 13 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో, 8 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎన్టీపీసీ 2.73 శాతం, ఎల్టీ 2.37 శాతం, హెచ్‌యూఎల్ 1.56 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.47 శాతం, పవర్‌గ్రిడ్ 1.44 శాతం లాభపడ్డాయి.
Top Losers : టెక్‌మహీంద్రా 1.75 శాతం, ఇన్ఫోసిస్ 1.23 శాతం, ఎటర్నల్ 1.10 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.92 శాతం, ఎయిర్టెల్ 0.76 శాతం నష్టపోయాయి.