అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market Updates | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) బుధవారం గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యాయి. ఐటీ సెక్టార్లో రిలీఫ్ ఒక్క రోజుకే పరిమితమై మళ్లీ అమ్మకాల ఒత్తిడికి గురవడంతో ప్రధాన సూచీలు పడిపోయాయి. యూఎస్, ఇరాన్‌ల మధ్య చర్చలు కొనసాగుతుండడం, రష్యా, ఉక్రెయిన్‌లో సమావేశమవనుండడం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవవహరిస్తున్నారు.
బుధవారం ఉదయం సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 51 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 440 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 7 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి 114 పాయింట్లు నష్టపోయింది. అయితే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 59 పాయింట్ల నష్టంతో 83,391 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 25,711 వద్ద ఉన్నాయి.
ఐటీలో మళ్లీ సెల్లాఫ్..
ఐటీ సెక్టార్ మళ్లీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నిఫ్టీ (Nifty) ఐటీ ఇండెక్స్ ఇంట్రాడేలో 2 శాతానికిపైగా నష్టపోయింది. మీడియా, కన్జూమర్ డ్యూరెబుల్స్, ఆటో, రియాలిటీ, యుటిలిటీ, ఎనర్జీ రంగాల షేర్లు నష్టాలతో సాగుతున్నాయి. మెటల్, ఎఫఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, పవర్, టెలికాం, బ్యాంకింగ్ షేర్లు రాణిస్తున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 13 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్ 2.98 శాతం, ఐటీసీ 1.57 శాతం, బజాజ్‌ఫిన్‌సర్వ్ 0.92 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.81 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.81 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎటర్నల్ 2.66 శాతం, టెక్‌మహీంద్రా 2.24 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.37 శాతం, టీసీఎస్ 1.34 శాతం, ఇన్ఫోసిస్ 3.81 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.