అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market Flat | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) మంగళవారం బలహీనంగా ప్రారంభమయ్యాయి. అయితే ఆంథ్రోపిక్‌తో సహకారం గురించి ఇన్ఫోసిస్ చేసిన ప్రకటనతో ఐటీ సెక్టార్ పరుగులు తీస్తోంది. ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు కనిష్టాల వద్దనుంచి కోలుకుంటున్నాయి.
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 80 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 210 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుని 536 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 45 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 67 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 160 పాయింట్లు పైకి ఎగబాకింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 135 పాయింట్ల లాభంతో 83,413 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 25,693 వద్ద ఉన్నాయి.
కోలుకున్న ఐటీ..
ఐటీ సెక్టార్ కోలుకుంటోంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇంట్రాడేలో 1.75 శాతానికిపైగా పెరిగింది. మీడియా, కన్జూమర్ డ్యూరెబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, రియాలిటీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 15 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 15 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 3.81 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.37 శాతం, ఐటీసీ 2 శాతం, ఆసియన్ పెయింట్స్ 1.78 శాతం, టీసీఎస్ 1.73 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎటర్నల్ 2.20 శాతం, టాటా స్టీల్ 1.24 శాతం, ట్రెంట్ 1.08 శాతం, రిలయన్స్ 1.02 శాతం, పవర్‌గ్రిడ్ 0.92 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.