అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market Fall | యూఎస్‌లో జాబ్ డేటా అంచనాలకన్నా బలంగా వచ్చింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు తగ్గడంతో వాల్‌స్ట్రీట్ ఒత్తిడికి గురయ్యింది.
భారత్‌లోనూ వృద్ధి రేటు బాగుండడంతో సమీప భవిష్యత్‌లో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురవుతున్నారు. గ్లోబల్ మార్కెట్లు (Global Markets) కూడా బలహీనంగా ఉండడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర పెరుగుతుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడుతోంది. దీంతో మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ప్రధానంగా ఐటీ సెక్టార్ సెల్లాఫ్‌కు గురవుతోంది.
గురువారం ఉదయం సెన్సెక్స్ 265 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 83,795 నుంచి 84,061 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,822 నుంచి 25,906 పాయింట్ల మధ్యలో కదలాడుతున్నాయి. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టంతో 83,83 వద్ద, నిఫ్టీ 111 పాయింట్ల నష్టంతో 25,842 వద్ద ఉన్నాయి.
టెక్ స్టాక్స్‌లో అమ్మకాలు..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో ఐటీ రంగానికి చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడితో కుదేలవుతున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4.3 శాతానికిపైగా నష్టంతో ఉంది. ఎఫఎంసీజీ, రియాలిటీ, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫైనాన్షియల్, బ్యాంకింగ్, మెటల్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు మాత్రమే ఓ మోస్తరు లాభాలతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 11 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 19 స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ 1.80 శాతం, ఎస్బీఐ 1.45 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.28 శాతం, ట్రెంట్ 1.19 శాతం, టాటా స్టీల్ 0.96 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 4.71 శాతం, టెక్ మహీంద్రా 4.45 శాతం, టీసీఎస్ 4.44 శాతం, హెచ్‌యూఎల్ 4.16 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.67 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.