అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Crash | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో మంగళవారం రక్తపాతం నెలకొంది. అన్ని సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ సెక్టార్‌ను ఆంథ్రోపిక్ క్లాడ్ భయపెడుతుండడంతో టెక్ స్టాక్స్ భారీగా సెల్లాఫ్‌కు గురయ్యాయి. నిఫ్టీ (Nifty) ఐడీ ఇండెక్స్ ఐదు శాతం మేర నష్టపోయింది.
రియాలిటీ, ఆటో సెక్టార్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 242 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 27 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 1,145 పాయింట్లు పడిపోయింది.
నిఫ్టీ 72 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 314 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 1,068 పాయింట్ల నష్టంతో 82,225 వద్ద, నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో 25,424 వద్ద స్థిరపడ్డాయి.
టారిఫ్‌ల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు (US Supreme Court) ఇచ్చిన తీర్పును అలుసుగా తీసుకుని వాణిజ్య ఒప్పందాలనుంచి వెనక్కి తగ్గాలని చూసే దేశాలపై భారీ టారిఫ్‌లు తప్పవంటూ హెచ్చరికలు చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు పెరుగుతున్నాయి. సరికొత్త ఫీచర్లతో దూసుకొస్తున్న ఏఐ టూల్స్ సంప్రదాయ టెక్ స్టాక్స్‌ను భయపెడుతున్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించి, లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రధాన సూచీలు నష్టాల బాటలో పయనించాయి.
ఐటీలో భారీగా అమ్మకాల ఒత్తిడి..
ఐటీ రంగం కుదేలవుతోంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4.74 శాతం నష్టపోయింది. రియాలిటీ ఇండెక్స్ 2.54 శాతం, టెలికాం 1.79 శాతం, మీడియా 1.31 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.67 శాతం, ఆటో ఇండెక్స్ 0.45 శాతం పడిపోయాయి. పవర్ ఇండెక్స్ 1.05 శాతం, మెటల్ 0.93 శాతం, యుటిలిటీ 0.90 శాతం, ఎనర్జీ 0.60 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.50 శాతం లాభాలతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,422 కంపెనీలు లాభపడగా 2,802 స్టాక్స్ నష్టపోయాయి. 143 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 91 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 357 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2.71 లక్షల కోట్ల మేర ఆవిరయ్యింది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 8 కంపెనీలు లాభాలతో, 22 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎన్టీపీసీ 1.94 శాతం, హెచ్‌యూఎల్ 0.62 శాతం, టాటా స్టీల్ 0.53 శాతం, పవర్‌గ్రిడ్ 0.49 శాతం, టైటాన్ 0.24 శాతం లాభపడ్డాయి.
Top Losers : టెక్‌మహీంద్రా 6.60 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 6.10 శాతం, ఎటర్నల్ 5.28 శాతం, ఇన్ఫోసిస్ 3.91 శాతం, టీసీఎస్ 3.79 శాతం నష్టపోయాయి.
