అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Stock Market Crash | టెక్ స్టాక్స్ ఏఐ భయాలనుంచి కోలుకోవడం లేదు. దీంతో ఐటీ స్టాక్స్‌లో సెల్లాఫ్ ఆగడం లేదు. దీనికితోడు ఇన్వెస్టర్లు మెటల్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యింది.
క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర పెరుగుతుండడం, రూపాయి విలువలో బలహీనత కొనసాగడం ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. రోజంతా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యింది. మెటల్ స్టాక్స్ కూడా సూచీలను కిందికి లాగాయి.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 772 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 177 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో 545 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 236 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 59 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 186 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 1,048 పాయింట్ల నష్టంతో 82,626 వద్ద, నిఫ్టీ (Nifty) 336 పాయింట్ల నష్టంతో 25,471 వద్ద స్థిరపడ్డాయి.
అన్ని సెక్టార్లలో నష్టాలు..
ఐటీ సెక్టార్లో సెల్లాఫ్ కొనసాగుతోంది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3.31 శాతం, ఎనర్జీ 1.94 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.88 శాతం, ఐటీ ఇండెక్స్ 1.44 శాతం పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరెబుల్స్, ఐటీ, టెలికాం, క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఆటో ఇండెక్స్లూ ఒక శాతానికిపైగా నష్టపోయాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,318 కంపెనీలు లాభపడగా 2,882 స్టాక్స్ నష్టపోయాయి. 164 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 83 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 193 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6.83 లక్షల కోట్ల మేర తగ్గింది.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 2 స్టాక్స్ లాభాలతో, 28 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ 2.43 శాతం, ఎస్బీఐ 0.53 శాతం లాభపడ్డాయి.
Top Losers :హెచ్‌యూఎల్ 4.35 శాతం, ఎటర్నల్ 4.16 శాతం, ఇన్ఫోసిస్ 3.68 శాతం, టైటాన్ 2.38 శాతం, టాటా స్టీల్ 2.35 శాతం, అదానిపోర్ట్స్ 2.2 శాతం నష్టపోయాయి.