HomeUncategorizedNationwide high alert | పాక్‌ కాల్పుల్లో భారత​ జవాన్‌ వీర మరణం.. దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌..

Nationwide high alert | పాక్‌ కాల్పుల్లో భారత​ జవాన్‌ వీర మరణం.. దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌..

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Nationwide high alert : పహల్​గామ్​​ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ‘ఆపరేషన్​ సింధూర్​’ నిర్వహించింది. ఈ నేపథ్యంలో పాక్​ ప్రతిదాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించింది. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు భారత్​ సన్నద్ధం అవుతోంది.

ఇక ఆపరేషన్​ సిందూర్ దెబ్బ​తో ఆగం అయిన పాక్​ ఏమి చేయాలో పాలుపోక సరిహద్దు వెంట కాల్పులు కొనసాగిస్తోంది. పూంఛ్‌, కుప్వారా, కర్నాహ్‌లో హోరాహోరీ కాల్పులు జరుపుతోంది. పాక్​ దాడిలో సరిహద్దు గ్రామాల్లో నలుగురు పిల్లలు సహా 15 మంది అమాయక ప్రజలు మరణించారు. కాగా, పాక్​ కాల్పులను భారత్​ ఆర్మీ దీటుగా ఎదుర్కొంటోంది. ఇండియన్‌ ఆర్మీ ప్రతిదాడితో పాక్​ సేనలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాక్‌ సైన్యం కాల్పుల్లో భారత జవాన్‌ వీర మరణం పొందారు. పూంచ్‌ సెక్టార్‌ దగ్గర పాక్‌ బలగాల కాల్పుల్లో దినేష్‌కుమార్‌ అనే జవాన్ మరణించారు.

Must Read
Related News