Homeఅంతర్జాతీయంWhisky | భారతీయ విస్కీల విజయకేతనం.. ‘ఇంద్రి’కి ప్రపంచ ఉత్తమ విస్కీ అవార్డు!

Whisky | భారతీయ విస్కీల విజయకేతనం.. ‘ఇంద్రి’కి ప్రపంచ ఉత్తమ విస్కీ అవార్డు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Whisky | 2025 గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్‌లో భారతీయ విస్కీలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయి. ఇంద్రి (Indri) డివాళీ కలెక్టర్ ఎడిషన్ 2025 మార్సాలా క్యాస్క్ ఫినిష్” విస్కీ ప్రపంచంలో అత్యుత్తమ విస్కీగా ఎంపికైంది.

ఇది 99.1 పాయింట్లతో దాదాపు పర్ఫెక్ట్ స్కోర్ సాధించింది. ఈ అవార్డ్స్ ప్రతి సంవత్సరం అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరుగుతాయి. అనుభవజ్ఞులైన నిపుణుల బృందం పూర్తిగా బ్లైండ్ టేస్టింగ్ ద్వారా ఈ విస్కీలను అంచనా వేస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచ విస్కీ విభాగంలో మొత్తం ఐదు విస్కీలు ఫైనల్స్‌కి చేరగా, అందులో నాలుగు భారతీయ విస్కీలే (Indian whiskies) ఉన్నాయి.

ఇంద్రి డివాళీ కలెక్టర్ ఎడిషన్ 2025 మార్సాలా క్యాస్క్ ఫినిష్ తయారీదారు పిక్కడిలీ డిస్టిల్లరీస్, హర్యానా (Haryana) కాగా, ఇందులో ఆల్కహాల్ శాతం 60%. దీని ప్ర‌త్యేక‌త‌లు కాండీడ్ ఆరెంజ్, ఎప్రికాట్, తేనె, డ్రై ఫ్రూట్స్, నట్, బేకింగ్ కోకో నోట్స్​లతో తయారవుతుంది. మ‌రో విస్కీ పేరు జియాన్‌చంద్ మంషా – పీటెడ్ సింగిల్ మాల్ట్ కాగా, దీని త‌యారీదారు: డెవాన్స్ బ్రూవరీస్, జమ్ము. ఇందులో ఆల్కహాల్ శాతం: 42.8%, దీని ప్రత్యేకతలు: స్మోక్, సాల్టీ అరోమా, సిట్రస్, హనీ, పెప్పర్​లతో తయారు చేస్తారు.

జియాన్‌చంద్ సిగ్నేచర్ – లైట్ స్మోక్ మాల్ట్ ప్రత్యేకతలు చూస్తే డ్రైడ్ ఫలాలు, జింజర్‌బ్రెడ్, హనీకాంబ్, చాక్లెట్ లతో రూపొందిస్తారు. మ‌రో విస్కీ అడంబరా – అన్‌పీటెడ్ మాల్ట్. రీసెంట్‌గా విడుదలైన ఈ విస్కీ ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకుంది. ప్రత్యేకతలు చూస్తే.. ఫ్లోరల్, వెనిల్లా, పీచెస్, కారం, బేకింగ్ స్పైసిస్​లతో తయారు చేయడం జరుగుతుంది.

డిస్టిల్లరీ క్రాస్ (ఆస్ట్రియా) – సుల్మ్ వాలీ విస్కీ (Sulm Valley Whisky) విష‌యానికి వ‌స్తే.. భారత విస్కీల మధ్య ఆస్ట్రియా నుంచి వచ్చిన ఏకైక ఎంపికగా చెప్పుకోవ‌చ్చు. దీని ప్రత్యేకతలు: స్వీట్ కార్న్, స్టోన్ ఫ్రూట్స్, వెనిల్లా, కోకనట్, చార్ వంటి పదార్ధాలతో తయారు చేస్తారు.

Whisky | భవిష్యత్తులో భారత విస్కీలకే ఆధిక్యం

ఈ అవార్డ్స్‌తో (Awards) భారత విస్కీ పరిశ్రమ అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. స్థానికంగా తయారయ్యే బార్లీ, టెక్స్చర్ మరియు క్యాస్క్ మ్యాచింగ్ లాంటి అంశాలు భారత విస్కీలను ప్రత్యేకంగా నిలిపాయి. ఇవి పరిమిత స్టాక్‌తో అందుబాటులో ఉంటాయి, కానీ త్వరగా అమ్ముడయ్యే అవకాశం ఉంది.

కాగా.. ప్రతీ సంవత్సరం కూడా అంతర్జాతీయంగా విస్కీస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పేరుతో Whiskies of the world పోటీలు జరుగుతూ ఉంటాయి. ఈ పోటీల్లో భాగంగా విస్కీలో వాడిన పదార్థాలు, దాని రుచి ఆధారంగా మొత్తం 100 పాయింట్లకు రేటింగ్ ఇచ్చి అందులో బెస్ట్ విస్కీని ఎంపిక చేయ‌డం జ‌రుగుతూ ఉంటుంది. దాదాపు అన్ని దేశాలు కూడా వారి దగ్గర తయారయ్యే బెస్ట్‌ బ్రాండ్స్‌ను ఈ పోటీలో ఉంచుతుంటాయి.. ఈ ఏడాది జరిగిన మద్యం పోటీల్లో భారత విస్కీ ఇంద్రి ఫస్ట్‌ ప్లేస్‌లో నిల‌వ‌డం విశేషం..

అమెరికా (America), ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా సహా పలు దేశాలకు చెందిన వంద బ్రాండ్లను వెనక్కి నెట్టి మ‌రీ మ‌న దేశంలో తయారైన విస్కీ టాప్‌లో నిల‌వ‌డం విశేషం. ఈ విస్కీ ఇప్ప‌టికే 14 కంటే ఎక్కువ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇంద్రి విస్కీ. ఇంద్రి విస్కీ దేశంలోని 19 రాష్ట్రాల్లో, 17 ఇతర దేశాల్లో కూడా అందుబాటులో ఉంది. దీని వాసన, రుచి, స్పర్శ, దృష్టి, ధ్వని వంటి ఐదు ఇంద్రియాల నేప‌థ్యంలో ఈ విస్కీకి ఇంద్రి అనే పేరు పెట్ట‌డం జ‌రిగింది.