అక్షర టుడే, ఇందూరు: Indian Psychiatric Society | ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోనల్ బ్రాంచ్ వార్షిక సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లో (Hyderabad) ఘనంగా ప్రారంభమైంది.
గచ్చిబౌలిలోని స్టాఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సదస్సులో ప్రముఖ సైకియాట్రిస్టులు, మానసిక ఆరోగ్య నిపుణులు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన సొసైటీ అధ్యక్షురాలు డా సవితా మల్హోత్రా (Dr. Savita Malhotra) ఈ సందర్భంగా మాట్లాడారు. సౌత్ జోన్ బ్రాంచ్ మానసిక ఆరోగ్య సేవలు, అకడమిక్ ప్రగతి, అవగాహన కార్యక్రమాలపై అభినందించారు.
Indian Psychiatric Society | కొత్త అధ్యక్షుడిగా డా. అరుల్ ప్రకాష్..
సౌత్ జోనల్ బ్రాంచ్ అధ్యక్షుడు డా. ఎం ఉమాశంకర్ అధ్యక్ష పతకాన్ని డా. అరుల్ ప్రకాష్‌కు అందజేశారు. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డా. అరుల్ ప్రకాష్ మాట్లాడుతూ.. దక్షిణ భారత రాష్ట్రాల మధ్య అకడమిక్, సేవా (academic, service) సమన్వయం పెంపొందించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
జనరల్ సెక్రటరీ డా. వి. జార్జ్ రెడ్డి వార్షిక కార్యకలాపాల నివేదిక సమర్పించారు. సీఎంఈ ఛైర్మన్ డా. పి. కిషన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా నారాయణరావు అకడమిక్ అభివృద్ధి, సామాజిక సైకియాట్రీ ప్రాముఖ్యాన్ని వివరించారు.
ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ డా. వై. శ్రీధర్ రాజు, ట్రెజరర్ డా. వి. జార్జ్ రెడ్డి, డా. విశాల్ సదస్సును విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సౌత్ జోన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రి, ఏడీహెచ్‌డీ హ్యాండ్‌బుక్, సైకియాట్రి సొసైటీ సావెనీర్, న్యూస్ లెటర్, ది మహాభారత మైండ్ పుస్తకాలు ఆవిష్కరించారు.
