అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jammu Kashmir | భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆపరేషన్ సిందూర్‌తో ఖంగుతిన్న పాక్ మూడో రోజు భారత్‌పై దాడి చేసింది.
శుక్రవారం అర్ధరాత్రి సరిహద్దు వెంబడి డ్రోన్లతో దాడులకు తెగబడింది. ప్రజలు, ఎయిర్‌పోర్టులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. పాక్ దాడులను భారత ఆర్మీ తిప్పికొట్టింది. అయితే జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి పట్టణంపై పాక్ దాడి చేసింది. ఈ ఘటనలో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ Rajouri adcp Raj Kumar తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.