HomeUncategorizedIndian Navy | యాంటీషిప్​ మిస్సైల్స్​ను పరీక్షించిన ఇండియ‌న్ నేవీ..

Indian Navy | యాంటీషిప్​ మిస్సైల్స్​ను పరీక్షించిన ఇండియ‌న్ నేవీ..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Indian Navy | పాకిస్తాన్‌తో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతోన్న వేళ.. భార‌త నావికాద‌ళం(Indian Navy) ఆదివారం బహుళ నౌకా నిరోధక క్షిపణి కాల్పులను విజయవంతంగా నిర్వహించింది. ఇది భార‌త సముద్ర ప్రయోజనాలను కాపాడటానికి నిబద్ధతను పునరుద్ఘాటించింద‌ని నేవీ తెలిపింది. “సుదూరంలో ఉన్న‌ ఖచ్చితమైన దాడి కోసం ప్లాట్‌ఫారమ్‌లు, వ్యవస్థలు, సిబ్బంది సంసిద్ధతను ధ్రువీకరించుకోవ‌డానికి, ప్రదర్శించడానికి ఇండియన్ నేవీ టెస్ట్ ఫైరింగ్(Indian Navy Test Firing) నిర్వ‌హించింది. బహుళ నౌకా నిరోధక కాల్పులను విజయవంతంగా చేపట్టింది. దేశ సముద్ర ప్రయోజనాలను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కాపాడటంలో భారత నావికాదళం స‌న్న‌ద్ధంగా ఉంద‌ని” “ఎక్స్”లో తెలిపింది.

Indian Navy | విజ‌య‌వంతంగా ప‌రీక్ష‌లు..

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్​గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి(Terrorist Attack) తర్వాత భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు తారా స్థాయికి చేరాయి. ఈ నేప‌థ్యంలోనే నేవీ తాజా స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక(Indigenous Guided Missile Destroyer) INS సూరత్ అరేబియా సముద్రంలో ప‌లు ప‌రీక్ష‌లు చేప‌ట్టింది. మీడియం-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి (ఎంఆర్‌-ఎస్ఎంఎం) వ్యవస్థను కూడా విజయవంతంగా పరీక్షించింది.

ఇజ్రాయిల్(Israel) సాయంతో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎంఆర్‌-ఎస్ఎంఎం(MR-SMM) ఉపరితలం నుంచి ఉపరితలంపైకి దాడులు చేయ‌డంతో పాటు వైమానిక దాడుల‌ను ఎదుర్కోవడంలో అత్యంత ప్రభావవంతంగా ప‌ని చేస్తుంది. ఇది దాదాపు 70 కిలోమీటర్లలోని ల‌క్ష్యాల‌ను క‌చ్చితంగా ఛేదించ‌గ‌ల‌దు. “భారత నావికాదళం తాజా స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్‌(INS) సూరత్ సముద్ర-స్కిమ్మింగ్ లక్ష్యం ఖచ్చితమైన సహకార నిశ్చితార్థాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇది మన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరో మైలురాయిని సూచిస్తుంది” అని నేవీ తెలిపింది.