Indian Navy enters | రంగంలోకి భారత నావికాదళం.. ఇండియన్​ ఆర్మీ కౌంటర్​ అటాక్​
Indian Navy enters | రంగంలోకి భారత నావికాదళం.. ఇండియన్​ ఆర్మీ కౌంటర్​ అటాక్​

అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Navy enters : భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత నావికాదళం సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పాక్​ను కట్టడి చేయడానికి పశ్చిమ కమాండ్ చేరాలని భారత నేవీ ఫోర్స్ యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్​పై ఇండియన్​ ఆర్మీ కౌంటర్​ అటాక్​ కొనసాగుతోంది.

భారత్​ ఎదురుదాడికి దిగడంతో పాకిస్తాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, బహవల్పూర్‌లలో సైరన్‌లు మోగించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాకిస్తానీయుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు చోట్ల భారత ఫోర్స్ డ్రోన్స్ ప్రయోగించింది.