ePaper
More
    Homeక్రీడలుIndian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్...

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    Published on

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup 2025 పురుషుల హాకీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా South Korea ను 4-1 తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను దక్కించుకుంది.

    ఈ అద్భుత విజయం ద్వారా భారత్, 2026లో బెల్జియం-నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న హాకీ ప్రపంచ కప్‌నకు నేరుగా అర్హత సాధించింది.

    indian hockey team | ఫైనల్ మ్యాచ్ హైలైట్స్:

    1వ నిమిషం: సుఖ్‌జీత్ సింగ్ అద్భుతమైన గోల్‌తో స్కోరును ప్రారంభించాడు

    2వ క్వార్టర్‌లో: దిల్ ప్రీత్ సింగ్ మరో గోల్ తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు

    3వ క్వార్టర్‌లో: రాజేందర్ గోల్ చేసి భారత్‌ను 3-0కి నడిపించాడు

    4వ క్వార్టర్‌లో: అమిత్ రోహిదాస్ ఫెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు

    చివర్లో సౌత్ కొరియా ఓ గోల్ సాధించినా.. అది ఓటమి తీవ్రతను మాత్రమే తగ్గించగలిగింది.

    ఈ విజయం భారత హాకీ పురుషుల జట్టుకు 2003, 2007, 2017 తరువాత నాలుగవ ఆసియా కప్ టైటిల్
    తెచ్చిపెట్టింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ అజేయంగా నిలిచింది.

    గ్రూప్ దశల నుంచే సుదీర్ఘ ఆధిపత్యాన్ని భారత్​ చూపింది. ఫైనల్‌లో తన దూకుడు, సమర్థతతో మెరిసిన దిల్ ప్రీత్ సింగ్‌ Dil Preet Singhకు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు లభించింది.

    ఈ అద్భుత విజయంపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖులు, క్రీడా నిపుణులు, మాజీ హాకీ క్రీడాకారులు భారత జట్టును అభినందిస్తున్నారు.

    ఈ విజయంతో భారత హాకీకి కొత్త ఊపు, కొత్త ఆశలు లభించాయి. ఈ టైటిల్ ద్వారా భారత్, హాకీ వరల్డ్ కప్ 2026 World Cup టోర్నమెంట్‌కు నేరుగా అర్హత పొందింది. ఈ విజయోత్సాహాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు భారత్ సిద్ధమవుతోంది.

    ఆసియా కప్ గెలిచాం.. ఇప్పుడు ప్రపంచ కప్ లక్ష్యం. భారత హాకీ జట్టు ఈ విజయంతో చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభించింది. టీమ్‌కి ప్ర‌తి ఒక్క భార‌తీయుడు ఫుల్ స‌పోర్ట్ అందిస్తున్నారు.

    More like this

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...

    Madhuyaski Goud | కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సరికాదు : మధుయాస్కి గౌడ్

    అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు...

    Bigg Boss 9 | గ్రాండ్‌గా బిగ్ బాస్ లాంచింగ్​.. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 (Bigg boss 9) ఎప్పుడెప్పుడు...