అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Crickters | 2025 సంవత్సరం భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ మెమోరీస్‌ని మిగిల్చింది అనే చెప్పాలి. అందుకు కారణం ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు సేవలు అందించిన పలువురు దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కు గుడ్‌బై చెప్పారు. టెస్టుల గౌరవాన్ని నిలబెట్టిన వారు, అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆటగాళ్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఛతేశ్వర్ పుజారా (Chateshwar Pujara) కూడా అన్ని ఫార్మాట్స్‌కి వీడ్కోలు పలికాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆయన ప్రయాణానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇటీవలి కాలంలో పుజారాకి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రిటైల్మెంట్ ప్రకటించారు.
Indian Crickters | వరుస రిటైర్మెంట్స్..
ఇప్పటికే విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohith Sharma), వృద్ధిమాన్ సాహా, వరుణ్ ఆరోన్ వంటి ఆటగాళ్లు కూడా 2025లోనే వీడ్కోల్ పలికారు. 2025లో రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారత క్రికెటర్ల లిస్ట్ చూస్తే.. రోహిత్ శర్మ మే 7, 2025న టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024లో టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లీ మే 12, 2025న టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 2024లో T20ల నుంచి కూడా తప్పుకున్న విరాట్ ఇప్పుడు టెస్ట్, టీ 20 ఫార్మాట్స్ లో కనిపించడు. వన్డేలలో మాత్రమే కొన్నేళ్ల పాటు ఆడనున్నాడు.
ఇక భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ భారతదేశం తరపున 9 టెస్ట్, 9 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 150 కి.మీ. వేగంతో బంతులని సంధించే అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో జనవరి 2025లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా భారతదేశం తరపున మొత్తం 49 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, అతను ఫిబ్రవరి 1న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.
ఇక 37 సంవత్సరాల వయస్సులో ఛతేశ్వర్ పుజారా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ఆగస్ట్ 24న ప్రకటించాడు. అతను దేశం తరపున కేవలం 5 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ, టెస్ట్ క్రికెట్‌లో మాత్రం గొప్ప ప్రదర్శన కనబరిచాడు. అతను 103 టెస్ట్ మ్యాచ్‌లలో 43.60 సగటుతో 7,195 పరుగులు సాధించగా, ఇందులో 19 సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ క్రికెటర్లు వారి కెరీర్‌లో గొప్ప విజయాలు సాధించారు. అయితే వారి రిటైర్మెంట్లతో భారత క్రికెట్‌లో ఓ యుగం ముగిసినట్టే. కొత్త తరం ఆటగాళ్లపై ఇప్పుడు పెద్ద బాధ్యతే ఉంది.