అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Cricketer Divorce | భారత క్రికెట్ వర్గాల్లో మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడిపోయిన విషయం తెలిసిందే.
అలాగే స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) కూడా కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో మరో పేరు చేరింది. భారత యువ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ తన భార్యతో నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికినట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు.
Indian Cricketer Divorce | భావోద్వేగ పోస్ట్
ఇన్స్టాగ్రామ్ (Instagram)లో షేర్ చేసిన సందేశంలో మేం చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం. అప్పటికి జీవిత విలువలు, బాధ్యతలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం. గత 15 నెలలుగా కోర్టు ప్రక్రియలు ఎదుర్కొంటూ సహనం, నిజాన్ని అంగీకరించే ధైర్యం నేర్చుకున్నాను. ఈ అధ్యాయాన్ని కోపం లేదా పశ్చాత్తాపంతో కాదు… స్పష్టతతో ముగిస్తున్నాను. సరైన న్యాయ ప్రక్రియ అనంతరం విడాకుల వ్యవహారం పూర్తయిందని, దీనికి తాను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కూడా వెల్లడించాడు.
రాహుల్ చాహర్ (Rahul Chahar) 2022 మార్చి 9న గోవాలో Goa ఈషానీ జౌహర్ ను వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. భారత ఆల్‌రౌండర్ దీపక్ చహర్ కూడా ఈ పెళ్లిలో పాల్గొన్నాడు. అప్పట్లో కేవలం 22 ఏళ్ల వయసులోనే రాహుల్ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. వచ్చే నెలతో వీరి వివాహానికి నాలుగేళ్లు పూర్తయ్యే వేళలోనే ఈ బంధం ముగిసింది. రాహుల్ చహర్ 2019 ఆగస్టు 6న వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 6 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు సాధించాడు. అతడి ఎకానమీ రేటు 7.59గా ఉంది.
2021లో శ్రీలంకతో జరిగిన ఏకైక వన్డేలో 3 వికెట్లు తీశాడు. 2021 నవంబర్ 8న చివరిసారిగా భారత్ జెర్సీలో కనిపించాడు. ఐపీఎల్ 2026లో ఆయన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున ఆడనున్నాడు. మొత్తానికి, భారత క్రికెట్లో మరో విడాకుల వార్త అభిమానులను నిరాశకు గురిచేసింది. రాహుల్ చహర్ వ్యక్తిగత జీవితం కొత్త దశలోకి అడుగుపెట్టగా, ఆయన కెరీర్‌పై ఇప్పుడు మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.