అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Police | భారత రాజ్యాంగ దినోత్సవానికి బుధవారం పోలీస్ శాఖ (Police Department) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అదనపు పోలీస్ కమిషనర్లు భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం (Indian Constitution Preamble Program) చేపట్టారు. సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు.. అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు డీసీపీ (ఏఆర్ ) రాంచందర్ రావు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు డీసీపీలు రాజ్యాంగ ప్రవేశిక గురించి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు తిరుపతి(వెల్ఫేర్), సతీశ్(హోమ్ గార్డ్స్), ఆఫీస్ సూపరింటెండెంట్లు, బషీర్, భరోసా సెంటర్ సిబ్బంది, పోలీస్ కార్యాలయ సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, సీసీఆర్బీ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూం, ఐటీ కోర్ సిబ్బంది, కమ్యూనికేషన్స్ సిబ్బంది, హోం గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.