అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan Army Commander | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీగా భారత్ ఆపరేషన్ సిందూర్ (operation sindoor) చేపట్టిన సంగతి తెలిసిందే. మే 7వ తేదీన పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడితో భయపడిన పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ (Pakistan Army Commander) ఒకరు మసీదులో దాక్కున్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. మసీదులో దాక్కున్న అతడు.. ముందుగా ప్రాణాలు కాపాడుకోండని తన సిబ్బందిని ఆదేశించినట్లు భారత ఆర్మీ అధికారి (indian army officer) ఒకరు వెల్లడించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్ సమీపంలో ఇండియా చేసిన సమన్వయ దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆస్తులను రక్షించడానికి బదులు పీవోకే 75వ పదాతిదళ బ్రిగేడ్ కమాండర్ తన సైనికులను ప్రాణాలను కాపాడుకోవాలని కోరారని ఆర్మీ అధికారి ఒకరు పీటీఐకి వెల్లడించారు.
Pakistan Army Commander | భయపడిన ఆర్మీ కమాండర్..
ఆపరేషన్ సిందూర్ (operation sindoor) సందర్భంగా మే 7న ఇండియా పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. లష్కరే తొయిబా, జేషే మహమ్మద్‌లకు చెందిన ఉగ్రవాద బేస్‌క్యాంపులను (terrorist base camps) ధ్వంసం చేసింది. అయితే, కేవలం 25 నిమిషాల్లోనే ముగిసిన ఈ దాడితో పాక్ ఆర్మీ గజగజా వణికిపోయింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని (kashmir) ముజఫరాబాద్ సమీపంలో ఇండియా చేసిన సమన్వయ దాడులతో పీఓకే 75వ పదాతిదళ బ్రిగేడ్ కమాండర్ తీవ్రంగా భయపడ్డారు. మసీదులో దాక్కున్న అతడు తమ ప్రాణాలను కాపాడుకోవాలని తన సైనికులను కోరారని భారత ఆర్మీ అధికారి (indian army officer) ఒకరు తెలిపారు. “ఒక మసీదు లోపల దాక్కున్న పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ (Pakistan Army Commander), ముందుగా ప్రాణాలను కాపాడమని దళాలకు ఎలా సూచిస్తున్న కమ్యూనికేషన్ మాకు దాడి సమయంలో లభించింది. ‘ముందుగా ప్రాణాలను కాపాడండి, కార్యాలయాలు తర్వాత తిరిగి తెరవవచ్చు’ అనేది ఆ కమ్యూనికేషన్ సందేశం” అని చినార్ కార్ప్స్ సీనియర్ అధికారి వివరించారు.
Pakistan Army Commander | మూడు రెట్లు విధ్వంసం తప్పదు..
ఆపరేషన్ సిందూర్‌తో (operation sindoor) పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చామని సదరు అధికారి వెల్లడించారు. “మా ప్రతీకారం 1:3 నిష్పత్తిలో ఉంటుంది, అంటే ప్రతి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు భారత సైన్యం (indian army) మూడు రెట్లు తీవ్రంగా దాడి చేస్తుందని” వివరించారు. పాక్‌లోని లీపా వ్యాలీ వద్ద ఉన్న అన్ని సైనిక మౌలిక సదుపాయాలను చినార్ కార్ప్స్ నాశనం చేసిందని వెల్లడించారు. “మేము కనీసం మూడు పోస్టులు, మందుగుండు సామగ్రి డిపో, ఇంధన నిల్వ సౌకర్యం, గన్నరీని పూర్తిగా నాశనం చేశాము. మా ప్రతీకారం చాలా వినాశకరమైనది. పాకిస్తాన్ పునర్నిర్మించడానికి కనీసం 8-12 నెలలు పడుతుంది, బహుశా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది” అని భారత ఆర్మీ సీనియర్ అధికారి (indian army senior officer) పిటిఐకి చెప్పారు.