అక్షరటుడే, న్యూఢిల్లీ: International Space Station : భారత వ్యోమగామి శుభాన్ష్ శుక్లా (Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లబోతున్నారు. యాక్సియమ్ – 4 (Ax-4) మిషన్ (Axium-4 (Ax-4) mission)లో భాగంగా అంతరిక్షంలోకి ప్రయాణించబోతున్నారు. ఆయనతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు మే 29న ‘ఐఎస్ఎస్’కు పయనం కానున్నారు. భారత్-అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ఈ మిషన్లో గ్రూప్ కెప్టెన్ శుక్లాను ఇదివరకే ఇస్రో (ISRO) ఎంపిక చేసింది.
యాక్సియమ్ స్పేస్ అమెరికాకు చెందిన సంస్థ. దీనికి ఇది నాలుగో ఐఎస్ఎస్ మిషన్. మే 29న కెనడీ స్పేస్ సెంటర్ Kennedy Space Center నుంచి స్పేస్ఎక్స్ వ్యోమనౌక(SpaceX spacecraft)లో నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్తున్నట్లు సంస్థ ప్రకటించింది. భారత్కు చెందిన శుక్లాతో పాటు పెగ్గీ విట్సన్ (అమెరికా), టిబర్ కపు (హంగరీ), స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ (పోలండ్) ఈ జాబితాలో ఉన్నారు. వీరు రెండు వారాలపాటు ఐఎస్ఎస్లో ఉండబోతున్నారు.
యాక్సియమ్-4 మిషన్లో భాగంగా ఏడు ప్రయోగాల్లో శుభాన్ష్ శుక్లా పాల్గొననున్నట్లు చెబుతున్నారు. అంతరిక్షంలో పంట సాగు, టార్డిగ్రేడ్ (నీటి ఎలుగుబంటి) గురించి అధ్యయనం చేయనున్నట్లు పేర్కొంటున్నారు.
కాగా.. భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుక్లానే అతిపిన్న వయస్కుడిగా ఉన్నారు.