HomeUncategorizedIndian Army | ‘ఆప‌రేషన్ సిందూర్‌’కు సంబంధించి మ‌రో వీడియో విడుద‌ల‌..

Indian Army | ‘ఆప‌రేషన్ సిందూర్‌’కు సంబంధించి మ‌రో వీడియో విడుద‌ల‌..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indian Army | ప‌హ‌ల్​గామ్​ ఉగ్ర‌దాడిలో (pahalgam terror attack) 26 మంది అమాయకులు మృత్యువాత ప‌డ్డారు. దీనికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత సైనిక సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చింది. పాక్‌ ఎయిర్‌ బేస్‌లపై (pakistan air bases) బ్రహ్మోస్‌ క్షిపణుల (brahmos missiles) వర్షంతో భీతిల్లిన పాక్‌ మూడు రోజుల్లోనే కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు ఒప్పుకోవడం ద్వారా యుద్ధాన్ని నివారిస్తూ ప్రధాని మోదీ (modi) కీలకంగా వ్యవహరించారని నేతలు కీర్తించారు. ఆపరేషన్‌ సిందూర్‌ (operation sindoor) విజయవంతమైన సందర్భంగా సైనికులకు సంఘీభావంగా ప‌లువురు ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. కొంద‌రు వారి గొప్ప‌త‌నాన్ని కీర్తిస్తున్నారు. పాక్‌లో 100 కిలోమీటర్ల లోపలకు భారత సాయుధ బలగాలు (indian armed forces) చొచ్చుకెళ్లి మరీ భీకరదాడుల జరిపాయని అమిత్ షా చెప్పారు.

Indian Army | మ‌రో వీడియో..

అనేక అంతర్జాతీయ ఉగ్ర కార్యకలాపాలకు వ్యూహరచన చేసి, సియాల్‌కోట్, ఇతర ఉగ్రవాద శిబిరాలలో (terror camps) తలదాచుకున్న ముష్కరులకు భారత్ (india) చాలా స్పష్టమైన సందేశమిచ్చింద‌ని ఆయ‌న తెలియ‌జేశారు. భారత ప్రజలపై ఎలాంటి టెర్రరిస్టు దాడులకు (terrorist attacks) పాల్పడినా రెట్టింపు బలంతో విరుచుకుపడతామనే సష్టమైన సంకేతాలిచ్చామని అమిత్ షా అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో (operation sindoor) పాకిస్తాన్‌కు ఇంతవరకూ చూపించింది ట్రైలరే. ఆ దేశం మళ్లీ తోక జాడిస్తే అసలు సినిమా ముందుముందు చూపిస్తామని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. సీజ్‌ఫైర్ (ceasefire) ఉల్లంఘిస్తే ఇకపై చుక్కలు చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

ఆపరేషన్‌ సిందూర్​లో ఉగ్రస్థావరాలను గుర్తించి అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో వంద మంది ఉగ్రవాదులు (terorrists)అంతమయ్యారని భారత సైన్యం తెలియ‌జేసింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 5, పాక్‌లో 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టం అయ్యాయి. భారత్‌ దాడులు(india attacks) చేస్తుందన్న భయంతో పాక్‌లోని ఉగ్రశిబిరాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా భారత సైన్యం( indian army) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన మరొక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో, ఆర్మీ సైనికులు ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నాశనం చేస్తున్నట్లు మ‌న‌కు స్ప‌ష్టంగా కనిపిస్తోంది. భారత సైన్యం (indian army) ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘ప్రణాళిక రూపొందించి, శిక్షణ ఇచ్చి, చర్య తీసుకున్నాం.. న్యాయం జరిగింది. ఆపరేషన్ సిందూర్(operation sindoor) పాకిస్తాన్ దశాబ్దాలుగా నేర్చుకునే ఒక గుణపాఠం అని భారత సైన్యం పేర్కొంది.

Must Read
Related News