అక్షరటుడే, వెబ్డెస్క్: Operation sindoor | భారత్ – పాక్(India – Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జమ్మూకశ్మీర్, పంజాబ్‌లోని పలు నగరాలను టార్గెట్గా చేసుకుని పాక్ దాడులకు యత్నించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ దాడులను తిప్పికొట్టింది. పాక్ ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్లను భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం(Indian Air Defense System) ధ్వంసం చేసింది. కాగా.. పాక్ దుస్సహసానికి ప్రతిస్పందనగా భారత్ సైన్యం(Indian Army) ఎల్వోసీ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ప్యాడ్(Terrorist Launchpad)లను ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.