అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2025 : దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్న ఐపీఎల్-2025 ముగింపు మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సీజన్‌ని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేయబోతున్నారు.
అహ్మదాబాద్(Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్లు తలపడుతున్నాయి. వేడుకలలో భాగంగా నరేంద్రమోడీ స్టేడియం (Narendra Modi Stadium) త్రివర్ణ శోభితమైంది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)కు ప్రతీకగా గగనతలంపై వైమానిక దళాలు మువ్వన్నెల జెండాను ప్రదర్శిస్తూ అభిమానుల్లో జోష్ నింపాయి. స్వరమాంత్రికుడు శంకర్ మహదేవన్ (Shankar Mahadevan) బృందం సైతం దేశభక్తి పాటలతో స్టేడియాన్ని హోరెత్తించారు.
IPL 2025 : సందడిగా..
మహదేవన్ MAhadevan, ఆయన కుమారులు భారత సైనికుల కీర్తిని చాటే గేయాలను ఆలపిస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేసారు. నత్యకారులు సైతం మూడు రంగుల దుస్తులు ధరించి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక స్టేడియంలోని అభిమానులు అయితే.. జాతీయ పతాకాన్ని చేతబూని.. జై హింద్, జై భారత్ నినాదాలతో సందడి చేసారు. ఇక టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ అవతరించినట్టే. సో.. విజేతగా నిలిచేది ఎవరు? అనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ సమఉజ్జీల పోరాటంలో 200 ప్లస్ స్కోర్ నమోదవ్వడం ఖాయం అనిపిస్తోంది.
ఎందుకంటే.. క్వాలిఫయర్ 2లో Qualifier 2 ముంబై ఇండియన్స్ 203 రన్స్ కొట్టింది. భారీ ఛేదనలో శ్రేయాస్ అయ్యర్ మెరుపు హాఫ్ సెంచరీతో పంజాబ్ 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు దూసుకెళ్లింది. అటు ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్. కాబట్టి.. కప్ ముద్దాడేందుకు.. ఛాంపియన్ అనిపించుకునేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడాల్సి ఉంటుంది. ఇక ఆర్సీబీ సాల్ట్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన క్యాచ్‌కి సాల్ట్ 16 పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 3 ఓవర్లకి గాను ఒక వికెట్ కోల్పోయి 30 పరుగులు చేసింది.