అక్షరటుడే, వెబ్డెస్క్ : Agniveer Recruitment | ఇండియన్ ఆర్మీ (Indian Army) అగ్నివీర్ 2026 నోటిఫికేషన్ విడుదల అయింది. పరీక్ష, ర్యాలీ వివరాలను అధికారులు విడుదల చేశారు.
అగ్నివీర్ రిక్రూట్మెంట్ కోసం ఇండియన్ ఆర్మీ తన అధికారిక వెబ్సైట్ joinindianarmy.nic.inలో నోటిఫికేషన్ జారీ చేసింది. జనరల్ డ్యూటీ (GD), టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్మన్, సోల్జర్ ఫార్మా, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, ఉమెన్ మిలిటరీ పోలీస్ వంటి వివిధ విభాగాలలో 25వేల కంటే ఎక్కువ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
Agniveer Recruitment | ఏప్రిల్ 1 వరకు..
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 01 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్లు ఆర్మీలో పని చేయాల్సి ఉంటుంది. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ చదివిన వారు ఆయా పోస్టులకు అర్హులు. 2005 జులై 1 నుంచి 2009 జులై 1 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి కనీసం 170 సెం.మీ ఎత్తు, 77 సెం.మీ విస్తరించని ఛాతీ 5 సెం.మీ విస్తరణతో ఉండాలి.
Agniveer Recruitment | పరీక్ష విధానం
అగ్నివీర్ (Agniveer) ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. అనంతరం రిక్రూట్మెంట్ ర్యాలీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ జనరల్ ఇంగ్లీష్ వంటి అంశాలు ఉంటాయి. పోస్టులను బట్టి మార్కులు, సబ్జెక్టులు మారుతు ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వారు రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటారు. ఇందులో 1.6 కి.మీ పరుగు, పుల్-అప్లు, 9 అడుగుల డిచ్, జిగ్-జాగ్ బ్యాలెన్స్, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష, వైద్య పరీక్ష ఉంటాయి. ఇందులో ఎంపికైన వారికి తొలి ఏడాది నెలకు రూ.30 వేల జీతం అందిస్తారు. జూన్ 1-15 వరకు పరీక్ష ఉంటుంది.