HomeUncategorizedJin jiji | ఇండియన్‌ ఆల్కహాల్‌ ‘జిన్‌ జిజి’ ఉత్తమ అవార్డు

Jin jiji | ఇండియన్‌ ఆల్కహాల్‌ ‘జిన్‌ జిజి’ ఉత్తమ అవార్డు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jin jiji | ఇండియాకు చెందిన ఆల్కహాల్‌ బ్రాండ్‌ ‘జిన్‌ జిజి’కి(Jin Jiji) ఉత్తమ స్పిరిట్‌ అవార్డు దక్కింది. లండన్‌(London)లో జరిగిన పోటీల్లో ఈ బ్రాండ్‌ 2025కు గాను ఉత్తమ స్పిరిట్‌గా ఎంపికైంది.

ప్రపంచ వ్యాప్తంగా వందలాది బ్రాండ్లు, అత్యంత ఖరీదైన ఆల్కహాల్‌ బ్రాండ్లు(alcohol brands) పోటీ పడగా.. ఇందులో ఇండియాకు చెందిన జిన్‌ జిజి(Jin Jiji) స్పిరిట్ కు అవార్డు దక్కడం విశేషం.

ఇండియాకు చెందిన చెందిన జిన్‌ జిజి(Jin Jiji) బ్రాండ్‌ గోవాలో ఉత్పత్తి అవుతోంది. హిమాలయన్‌ జునిపెర్‌, తులసి వంటి వృక్షశాస్త్రాల మిశ్రమాన్ని ఉపయోగించి ఈ బ్రాండ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో ఈ ఆల్కహాల్‌ను తయారు చేస్తున్నారు. పలుచోట్ల ఈ బ్రాండ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఈ బ్రాండ్‌ను మాస్టర్‌ సోమెలియర్‌ కెన్‌, అన్ష్‌ ఖన్నా స్థాపించారు.