అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs AUS | ఆస్ట్రేలియా గడ్డపై మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. తొలి రెండు మ్యాచ్‌లలో గట్టి ప్రదర్శన చేసినప్పటికీ ఓటమి చెందడంతో సిరీస్ కోల్పోయింది.
మూడో వన్డేలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పూర్వ వైభవం చూపించాడు. సిడ్నీ పిచ్‌పై రోహిత్ 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 121 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. వన్డేల్లో ఇది అతని 33వ సెంచరీగా నిలిచింది. 237 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ (India), రోహిత్ మరియు కోహ్లీ అజేయంగా రెండో వికెట్ కోసం 150 పరుగులకి (168* భాగస్వామ్యాం) పైగా రన్స్ జోడించడంతో భారత్ సులువుగా విజయం సాధించింది.
IND vs AUS | రోహిత్ మాయ..
రోహిత్ రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న తర్వాత, మూడో వన్డేలో సెంచరీతో మళ్లీ విధ్వంసం సృష్టించాడు. రోహిత్ సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేషన్‌పై దృష్టి పెట్టాడు. చెత్త బంతులు పడ్డప్పుడు బంతిని బౌండరీకి తరలించాడు. ఇక కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ సాధించి టీమ్‌ను సులభంగా విజయం వైపు నడిపాడు. రోహిత్ శర్మ ద్భుత ప్రదర్శనతో భారత్ భారీ విజయం సాధించింది. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు వన్డేల్లో డకౌట్స్ అయిన టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు పరుగుల ఖాతా తెరిచి అర్ధ సెంచరీ సాధించాడు. 81 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఫస్ట్ డౌన్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చి క్విక్ సింగిల్ తీసాక ఊపిరి పీల్చుకున్నాడు.. రోహిత్ శర్మ వైపు చూస్తూ.. సింగిల్ సాధించానని సైగ చేయడం అందరిని ఆకట్టుకుంది.
కాగా, శుభ్‌మన్ గిల్ (24) నిరాశపరిచాడు. కోహ్లీ (Virat Kohli)ని స్టాండింగ్ ఒవేషన్‌తో గౌరవించారు.. సిడ్నీ ప్రేక్షకులు క్రీజులోకి రాగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగుల వద్ద ఆలౌటైంది. మ్యాట్ రేన్‌షా 58 బంతుల్లో 56 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. మిచెల్ మార్ష్ (41), మాథ్యూ షార్ట్ (30) కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4/39తో నాలుగు వికెట్లు తీసి విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించగా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ సాధించారు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీసి బౌలింగ్‌లో సహకరించాడు.

