అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jaishankar | భారతదేశం ఉగ్రవాదాన్ని (terrorism) ఏమాత్రం సహించదని, అణ్వస్త్ర బెదిరింపులకు ఎప్పటికీ లొంగదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (External Affairs Minister S Jaishankar) శుక్రవారం స్పష్టం చేశారు. బెర్లిన్‌లో జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్‌తో (German Foreign Minister Johannes Wadeful) జరిగిన చర్చల తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మీడియాతో మాట్లాడారు. “పహల్గామ్ ఉగ్రవాద దాడికి (Pahalgam terror attack) భారతదేశం స్పందించిన వెంటనే నేను బెర్లిన్‌కు వచ్చాను. ఉగ్రవాదాన్ని భారత్ సహించదు. భారతదేశం (India) ఎప్పుడూ అణ్వస్త్ర బెదిరింపులకు లొంగదు. భారతదేశం పాకిస్తాన్‌తో (pakistan) పూర్తిగా ద్వైపాక్షికంగా వ్యవహరిస్తుంది” అని జైశంకర్ అన్నారు. ప్రతి దేశానికి ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఉందని జర్మనీ (Germany) అర్థం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు.
Jaishankar | ఉగ్రవాద వ్యతిరేక పోరుకు జర్మనీ మద్దతు
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి జర్మనీ మద్దతునిస్తుందని (Germany support) ఆ దేశ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్ (Foreign Minister Johannes Wadeful) తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే ఏ పోరాటానికైనా బెర్లిన్ మద్దతు ఇస్తుందని, ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాదానికి స్థానం ఉండకూడదని అన్నారు. “ఉగ్రవాదానికి (Terrorism) వ్యతిరేకంగా జరిగే ఏ పోరాటానికైనా జర్మనీ మద్దతు ఇస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదానికి స్థానం ఉండకూడదు, అందుకే ఉగ్రవాదంతో పోరాడే, పోరాడాల్సిన ప్రతి ఒక్కరికీ మేము మద్దతు ఇస్తాం. కాల్పుల విరమణ కుదిరినందుకు మేం అభినందిస్తున్నాం. త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం” అని జర్మన్ విదేశాంగ మంత్రి (German Foreign Minister) తెలిపారు.
అంతకు ముందు జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో (German Chancellor Friedrich Merz) సమావేశమైన జైశంకర్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి (India’s fight against terrorism) జర్మనీ సంఘీభావం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భౌగోళిక రాజకీయ గందరగోళం మధ్య స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకునే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు.