Homeక్రీడలుIndia-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టికెట్లు

India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టికెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌కు ఈసారి అభిమానుల స్పందన ఆశించినంతగా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం(Dubai International Stadium)లో జరగనున్న ఈ ఆసక్తికర పోరుకు టికెట్లు ఇంకా సోల్డ్ అవుట్ కాలేదు.

సాధారణంగా ఇలాంటి మ్యాచ్‌లకు టికెట్లు రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ ఉండేవి. కానీ ఈసారి పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఏసీసీ (Asian Cricket Council) తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ప్రస్తుత రాజకీయ వాతావరణం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

India-Pakistan | ప్యాకేజ్ సిస్టమ్‌కు అభిమానుల బ్రేక్!

గతంలో వన్ మ్యాచ్ టికెట్ కొనుగోలు చేసే సౌలభ్యం ఉండేది. కానీ ఈసారి ఏసీసీ ప్యాకేజీ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే, భారత్-పాకిస్తాన్(India-Pakistan) మ్యాచ్‌తో పాటు ఇతర గ్రూప్ మ్యాచ్‌లను కలిపి టికెట్లు విక్రయిస్తోంది. ఫలితంగా, ఒక్క మ్యాచ్ చూడాలంటేనూ భారీ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కొన్ని ప్యాకేజీల  ధరలు రూ. 2.5 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. VIP సూట్స్‌, స్కై బాక్స్‌లు, రాయల్ లాంజ్‌ టికెట్లు ఇంకా మిగిలి ఉండడం దీనికి నిదర్శనం.వయాగో, ప్లాటినమ్ లిస్ట్‌ లాంటి పోర్టల్స్‌ మీద రెండు సీట్ల ధరలు రూ. 1.67 లక్షల నుంచి రూ. 2.57 లక్షల వరకు ఉన్నాయి. “ఒక్క మ్యాచ్‌ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడం వేస్ట్‌. పైగా, ఈ ప్యాకేజీల్లో సూపర్ ఫోర్ లేదా ఫైనల్ మ్యాచ్‌లు కూడా లేవు. ఒక్కగ్రూప్ మ్యాచ్‌ చూసేందుకే ఇంత రేటు పెట్టి కొనుగోలు చేయ‌డం వేస్ట్’’ అని అభిమానులు అంటున్నారు.

మ‌రోవైపు ఆ మ్యాచ్‌ను నిషేధించాలని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు కావ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. పూణేకు చెందిన కార్యకర్త కేతన్ తిరోద్కర్ పిటిషన్ ప్ర‌కారం ఏప్రిల్​ నెలలో జ‌రిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో భారతదేశం vs పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు నిర్వహించడం ఎంత వర‌కు కరెక్ట్ అని ఆయ‌న ప్రశ్నిస్తున్నారు.